ETV Bharat / jagte-raho

దీక్షిత్​రెడ్డిని కిడ్నాప్​ చేసి అన్నారం గుట్టవరకు ఎలా తీసుకెళ్లారు?

author img

By

Published : Oct 29, 2020, 9:34 AM IST

దీక్షిత్​రెడ్డి కిడ్నాప్​, హత్య కేసుపై పోలీసులు పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని కృష్ణాకాలనీలో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. దీక్షిత్​రెడ్డిని ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశాడు.. అన్నారం గుట్ట వరకు ఎలా తీసుకెళ్లాడు.. వంటి అంశాల కోసం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు.

deekshit reddy case
దీక్షిత్​రెడ్డిని కిడ్నాప్​ చేసి అన్నారం గుట్టవరకు ఎలా తీసుకెళ్లారు..?

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన దీక్షిత్​రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు మందసాగర్​ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. పలు కోణాల్లో విచారిస్తున్నారు. కృష్ణాకాలనీలో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు.

దీక్షిత్​రెడ్డిని ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశాడు.. అన్నారం గుట్ట వరకు ఎలా తీసుకెళ్లాడు.. నిందితుడితో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్ చేయించారు. గుట్టపై బాలుడిని చంపిన ప్రదేశం, పరిసరాలను పరిశీలించారు. సాగర్ స్వస్థలం శనిగపురంలోని సాగర్ డెన్​ను, మహబూబాబాద్​లోని సాగర్ ఆటోమొబైల్ దుకాణం పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా సోదాలు చేశారు.

కిడ్నాప్​ సమయంలో ఎవరు ఫోన్​ చేస్తున్నారో గుర్తుపట్టకుండా ఎలాంటి సాంకేతిక పరికరాలు వినియోగించారు... అనే దానిపైనా ఆరాతీశారు. స్లీపింగ్ టాబ్లెట్​లు ఎక్కడ నుంచి తీసుకువచ్చాడనే కోణంలోనూ ప్రశ్నించారు. సాగర్ వినియోగించిన ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని పలు పోలీస్​ స్టేషన్లలో విచారణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

దీక్షిత్​రెడ్డిని కిడ్నాప్​ చేసి అన్నారం గుట్టవరకు ఎలా తీసుకెళ్లారు..?

ఇవీచూడండి: నిద్ర మాత్రలు ఇచ్చి.. గొంతునులిమి దీక్షిత్‌ హత్య..

బాలుడి కిడ్నాప్ దృశ్యాలు.. ఇదిగో లైవ్ వీడియో..

'వాళ్లనైనా చంపండి.. లేదంటే మేమైనా చస్తాం'

'మాకొచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు... నిందితుడిని వెంటనే శిక్షించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.