ETV Bharat / jagte-raho

ఇంజినీరింగ్ ప్రొఫెసర్... ఏకంగా 15 సార్లు ఓటీపీ చెప్పిన వైనం

author img

By

Published : Dec 15, 2020, 9:52 PM IST

ఆయనో ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్​గా పని చేస్తున్నారు. క్రెడిట్ కార్డుకు రివార్డ్​ పాయింట్లు మీ ఖాతాలో జమ చేసుకోవడానికి మేం చెప్పినట్లు మీరు చేయండంటూ సైబర్ నేరగాళ్లు వల వేశారు. అందులో చిక్కుకొని 15సార్లు ఓటీపీ చెప్పేశారు. సదరు వ్యక్తి ఖాతా నుంచి రూ. 2.8 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు.
సైబర్ వలలో ప్రొఫెసర్... ఏకంగా 15 సార్లు ఓటీపీ చెప్పిన వైనం
సైబర్ వలలో ప్రొఫెసర్... ఏకంగా 15 సార్లు ఓటీపీ చెప్పిన వైనం

హైదరాబాద్​ విద్యానగర్​కు చెందిన ఓ వ్యక్తి నగర శివారు ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్​గా పని చేస్తున్నారు. ఆంధ్రా బ్యాంకు, ఐసీఐసీఐ, స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంక్​లకు సంబంధించిన క్రెడిట్ కార్డులు కలిగి ఉన్నారు. కాగా తాము స్టాండర్డ్ చార్డెట్ బ్యాంక్​ నుంచి మాట్లాడుతున్నామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు.

మీ క్రెడిట్ కార్డుకు రివార్డ్​ పాయింట్లు వచ్చాయి. వాటిని మీ ఖాతాలో జమ చేసుకోవాలంటే ప్రాసెస్ ఉందని... మీరు వివరాలు చెబితే మేం పూర్తి చేస్తామంటూ చెప్పగా... ప్రొఫెసర్ కేటుగాళ్ల మాటలు నమ్మేశారు. అడిగినట్లుగా కార్డు వివరాలు, సీవీవీ నంబర్​తో సహా చెప్పేశాడు. అంతటితో ఆగకుండా మీ ఫోన్​కు మెసేజ్ వస్తుందని... అందులో ఉండే నంబర్ చెబితే ప్రాసెసింగ్ పూర్తవుతుందని సూచించగా సెల్​ఫోన్​కు వచ్చిన ఓటీపీ నంబర్​ను చెప్పేశాడు. ఒక్కసారి కాదు ఏకంగా 15సార్లు తన సెల్​ఫోన్​కు వచ్చిన ఓటీపీని సైబర్ నేరగాళ్లకు చెప్పేశారు.

మీరు బాధ్యత గల ప్రొఫెసర్​ కదా కనీసం ఓటీపీ చెప్పొద్దనే ఆలోచన మీకు రాలేదా అంటూ పోలీసులు ప్రశ్నిచగా... తాను ఫోన్​లో మాట్లాడుతున్నానని... ఆలోచించకుండా అడిగిన వివరాలు చెబుతూ వెళ్లానంటూ చెప్పుకొచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి: కొవిడ్‌ వైద్యులకు విరామం ఇవ్వరా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.