ETV Bharat / jagte-raho

పంట కాలువలో పడి రెండేళ్ల చిన్నారి మృతి

author img

By

Published : Sep 28, 2020, 9:37 PM IST

ములుగు జిల్లా యోగితానగర్​ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి పంటకాలువలో పడి మృతి చెందాడు.

A two year old child falling into a crop canal and died in Mulugu district
పంట కాలువలో పడి రెండేళ్ల చిన్నారి మృతి

ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యోగితానగర్ గ్రామ సమీపంలోని పాలెం ప్రాజెక్టు పంట కాలువలో అక్షయ్ కుమార్ అనే రె౦డేళ్ల బాలుడు మునిగి మృతి చెందాడు. గ్రామం పక్కనే ఉన్న కాలువలో పిల్లలు ఆడుకు౦టూ ఉండగా బాబు నీళ్లలో మునిగిపోయాడు.

సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు బాలుని వెలికితీసి, వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇదీ చూడండి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. ఉపాధ్యాయుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.