ETV Bharat / international

ఉగ్రవాద నిర్మూలన కోసం భారత్​-అరబ్ దేశాల సహకారం​

author img

By

Published : Jan 13, 2021, 11:19 AM IST

ఉగ్రవాద నిర్మూలనకు కలిసికట్టగా పని చేయాలని భారత్​- అరబ్​ లీగ్​ దేశాలు పిలుపునిచ్చాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల బలోపేతమే లక్ష్యంగా జరిగిన దృశ్య మాధ్యమ సమీక్షలో ఈ మేరకు నిర్ణయించాయి.

india-arab-league-vow-to-deepen-cooperation-in-counter-terrorism
ఉగ్రవాద నిర్మూలనకు భారత్​- అరబ్​లీగ్​ దేశాల ప్రతిజ్ఞ

ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని భారత్​- అరబ్​ లీగ్​ దేశాలు పిలుపునిచ్చాయి. అలాగే ఉగ్రవాద నిర్మూలనకు ఇరు దేశాల మధ్య లోతైన సహాయ సహకారాలు అవసరం పేర్కొన్నాయి.

భారత్​- అరబ్​ సహకార ఫోరం తృతీయ శ్రేణి సీనియర్​ అధికారుల మధ్య మంగళవారం దృశ్య మాధ్యమ సమీక్ష జరిగింది. అందులో భారత్​- అరబ్​ లీగ్​ దేశాల మధ్య వాణిజ్యం మరింత బలోపేతమవ్వాలని ప్రతిన పూనాయి. సముద్ర సంబంధింత వాణిజ్య భద్రతపై దృష్టిసారించాలని నిర్ణయించాయి. అంతేకాకుండా నావిగేషన్​ విషయంలో మరింత స్వేచ్ఛ ఉండాలని పేర్కొన్నాయి.

దేశీయ, అంతర్జాతీయ సమస్యల పరిష్కారం కోసం అరబ్​- భారత్​ దేశాల మధ్య బంధం మరింత బలోపేతం కావాలని స్పష్టం చేశాయి. ప్రపంచ శాంతి కోసం లీగ్​ దేశాలు, భారత్​తో కలిసి పనిచేయాలని పేర్కొన్నాయి. ఈ సందర్భంగా మధ్య ఆసియాలో నెలకొన్న పాలస్తీనా సమస్య, సిరియా, లిబియా, యెమెన్​లో నెలకొన్న సంక్షోభాల్ని ప్రస్తావించి వాటికి తగిన రాజకీయ పరిష్కారాల్ని సూచించాలని పునరుద్ఘాటించాయి.

ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపై పోరులో కొన్ని దేశాలది ద్వంద్వ వైఖరి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.