ETV Bharat / international

దుబాయ్ వెళ్లేందుకు భారత ప్రయాణికులకు అనుమతి, కానీ!

author img

By

Published : Jun 20, 2021, 8:52 AM IST

కరోనా దృష్ట్యా భారత్​ సహా వివిధ దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను దుబాయ్​ సడలించింది. తాము ఆమోదించిన కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారు దుబాయ్​కి రావొచ్చని అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

dubai
దుబాయ్

కరోనా ఉద్ధృతి తగ్గుతున్నవేళ.. యూఏఈ ప్రయాణ ఆంక్షలను సడలించింది. భారత్ నుంచి రెసిడెన్స్ వీసాతో దుబాయ్ వచ్చే ప్రయాణికులను ఈ నెల 23 నుంచి అనుమతించాలని నిర్ణయించింది. అయితే తాము అనుమతించిన టీకాల రెండు డోసులు తీసుకొని ఉండాలని షరతు విధించింది. ఆ దేశ సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గల్ఫ్‌ మీడియా వెల్లడించింది.

ఆ దేశాలకే..

దక్షిణాఫ్రికా, నైజీరియా, భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం యూఏఈ ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. భారత్‌కు సంబంధించి రెసిడెన్స్ వీసా కలిగి ఉండి, తాము ఆమోదించిన టీకా రెండు డోసులు తీసుకున్న వారిని మాత్రమే అనుమతించనున్నట్లు యూఏఈ స్పష్టం చేసింది.

ఆ టీకాలు ఇవే..

సినోఫార్మ్, ఫైజర్- బయోఎన్‌టెక్, స్పుత్నిక్‌- వీ, ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా టీకాల వినియోగానికి యూఏఈ అనుమతించింది. దక్షిణాఫ్రికా, నైజీరియాల నుంచి రెసిడెన్స్ వీసా లేనివారిని సైతం అనుమతిస్తామని స్పష్టం చేసింది. అయితే వ్యాక్సినేషన్, ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరిని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి : టీకా తీసుకుంటే.. పబ్​లలో 50శాతం డిస్కౌంట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.