కృత్రిమ వర్షంతో పులకరించిన దుబాయ్​

author img

By

Published : Jul 22, 2021, 10:20 PM IST

artificial Rain

దుబాయ్​లో వేడిని తట్టుకునేందుకు అక్కడి ప్రభుత్వం కృత్రిమంగా వర్షాన్ని సృష్టించింది. అంతకంతకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను అదుపు చేయడాని ఈ వినూత్న ప్రయోగం చేపట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఓవైపు భారత్​, చైనా వంటి దేశాలు వర్షాలతో విలవిలలాడుతుంటే.. ప్రపంచంలోని పలు దేశాలను వరుణుడు ఎన్నో ఏళ్లుగా కనికరించడంలేదు. ఇందులో దుబాయ్​ ముందు వరుసలో ఉంటుంది. 50డిగ్రీల ఉష్ణోగ్రతతో దుబాయ్​వాసులు భానుడి భగభగలు తట్టుకోలేకపోతున్నారు. ఎండలతో విసిగిపోయిన అక్కడి ప్రభుత్వం ఓ భారీ ప్రాజెక్టును చేపట్టింది. వరుణుడు కనికరించకపోయినా వర్షాన్ని నేలకు తీసుకొచ్చే పనిలో పడింది. ఇందుకు క్లౌడ్​ సీడింగ్​ అని పిలిచే రెయిన్​ మేకింగ్​ టెక్నాలజీని ఉపయోగించింది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. దీని తాలూకూ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

క్లౌడ్​ సీడింగ్​ అంటే?

క్లౌడ్ సీడింగ్ అనేది డ్రోన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఆకాశం మేఘావృతం అయినప్పుడు డ్రోన్​లను మేఘాల మధ్యకు పంపుతారు. వాటి ద్వారా విద్యుత్​ షాక్​ ఇస్తారు. ఇలా చేయడం ద్వారా అవి కలిసిపోయి వర్షం సృష్టించడానికి ప్రేరేపిస్తాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించడానికి ఇంగ్లాండ్​లోని యూనివర్శిటీ ఆఫ్​ రీడింగ్​కు చెందిన ప్రొఫెసర్​ మార్టిన్​ అంబామ్​ నేతృత్వం వహించారు. ఈ ప్రాజెక్ట్​ కోసం సుమారు 15 మిలియన్​ డాలర్లును అక్కడి ప్రభుత్వం ఖర్చు చేసింది.

ముందే హెచ్చరికలు..

దుబాయ్​లో ఈ భారీ వర్షపాతానికి ముందు అక్కడి పోలీసులు, వాతావరణ శాఖ స్థానిక ప్రజలను హెచ్చరికలు జారీ చేశారు. ఆ సమయంలో ఎవరూ బయటకు రావద్దని కోరారు. ముఖ్యంగా ప్రయాణాలు చేయకూడదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బంప్​ లేకుండానే ఇద్దరు పుట్టారు.. ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.