పది సంవత్సరాలు కట్టిన కట్టడం.. లంకకు తెల్ల ఏనుగులా మారనుందా?

author img

By

Published : Sep 14, 2022, 10:58 PM IST

srilanka lotus tower

Sri Lanka Lotus Tower : ద్వీప దేశం శ్రీలంకలో అద్భుత కట్టడాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. దాదాపు పదేళ్ల క్రితం ప్రారంభమై వివిధ కారణాలతో ఆగిన ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తైంది. చైనా సహకారంతో నిర్మించిన ఈ కట్టడం.. ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతున్న దేశానికి తెల్ల ఏనుగులా మారనుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Sri Lanka Lotus Tower : ద్వీప దేశమైన శ్రీలంక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'లోటస్‌ టవర్‌' ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. చైనా రుణంతో నిధులు సమకూర్చుకొని దాదాపు పదేళ్ల పాటు నిర్మించిన ఈ 'కొలంబో లోటస్‌ టవర్‌' ఈ వారంలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1150 అడుగులు (350 మీటర్ల) ఎత్తు కలిగిన ఈ భారీ టవర్‌ అబ్జర్వేషన్ డెక్‌ గురువారం నుంచి సందర్శకులకు తెరిచే ఉంటుందని ప్రభుత్వం ఆధ్వర్యంలోని కొలంబో లోటస్‌ టవర్‌ యాజమాన్యం సంస్థ వెల్లడించింది. ఈ భవనంలోని ఆఫీస్‌, షాపింగ్‌ స్థలాన్ని అద్దెకు ఇవ్వనున్నారు. ఈ టవర్‌ నుంచి రద్దీగా ఉండే రాజధాని కొలంబో నగరంతో పాటు హిందూ మహా సముద్రాన్ని వీక్షించవచ్చు. అయితే, ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకకు ఈ టవర్‌ ఓ 'తెల్ల ఏనుగు'గా మారనుందనే విమర్శలూ వినబడుతున్నాయి.

ఈ టవర్‌ ప్రత్యేకతలివే..

  • తామర పువ్వు నమూనాలో ఈ భవనాన్ని డిజైన్‌ చేశారు.
  • ఆసియాలో ఉన్న ఎత్తయిన టవర్లలో 11వది కాగా.. ప్రపంచంలో 19వ ఎత్తయిన టవర్‌.
  • తొలుత దీన్ని పెలియగోడ సబర్బన్‌లో నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే, ఆ తర్వాత శ్రీలంక ప్రభుత్వం ఆ లొకేషన్‌ను మార్పు చేసింది. ఈ టవర్‌ను కమ్యూనికేషన్‌, అబ్జర్వేషన్‌, ఇతర అవసరాల కోసం ఉపయోగించనున్నారు.
  • ఈ టవర్‌ నిర్మాణానికి అంచనా వ్యయం 113 మిలియన్‌ అమెరికా డాలర్లు. 2012లో (మాజీ అధ్యక్షుడు మహీందా రాజపక్స హయాంలో) టవర్‌ నిర్మాణం మొదలుపెట్టారు. అప్పట్నుంచి అవినీతి ఆరోపణలు రావడంతో ఆటంకాలు ఏర్పడి ఎట్టకేలకు పూర్తయింది.
  • ఈ టవర్‌కు పర్యాటకం, యాంటెన్నా లీజింగ్‌ ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నారు. ఈ లోటస్ టవర్ రేడియో, టీవీ ప్రసార యాంటెన్నా ఐఎస్​డీబీ-టీ, 50 టీవీ సర్వీసుల కోసం ప్రతిపాదించిన డీవీబీ-టీ2 సపోర్ట్ స్ట్రక్చర్‌గా పని చేస్తుంది. అలాగే, 35 ఎంఫ్‌ఎం రేడియో స్టేషన్లు, 20 టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు ఇది సేవలందిస్తుంది.
  • లోటస్‌ టవర్‌కు నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వీటిలో రెండు వీఐపీ ఎంట్రన్స్‌లు. లోటస్ టవర్ పొడియం ఆరు అంతస్తుల్లో ఉండగా.. ల్యాండ్‌ స్కేపింగ్‌ని పెద్ద వాటర్‌ పార్క్‌గా నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

ఇవీ చదవండి : బ్రిటన్ రాణి అంత్యక్రియలకు ముర్ము.. రాష్ట్రపతిగా తొలి విదేశీ పర్యటన

ఎయిర్ ఇండియా ఫ్లైట్​లో మంటలు.. రన్​వేపై ఉండగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.