ETV Bharat / international

కశ్మీర్​ భారత్​లో అంతర్భాగం.. పాక్​ వ్యాఖ్యలకు స్ట్రాంగ్​ కౌంటర్​!

author img

By

Published : May 20, 2022, 10:26 AM IST

Updated : May 20, 2022, 1:36 PM IST

india on pakistan
india on pakistan

Bilawal Bhutto On India: భారత్​తో సంబంధాలపై పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి బిలావల్​ భుట్టో స్పందించారు. ఆర్టికల్​ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజనతో ఇరు దేశాల సంబంధాలు మరింత సంక్షిష్టంగా మారాయన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను భారత్​ తీవ్రంగా ఖండించింది. జమ్ముకశ్మీర్ భారత్​లో అంతర్భాగమని స్పష్టం చేసింది.

జమ్ముకశ్మీర్ వ్యవహారాన్ని పాకిస్థాన్ మరోసారి లేవనెత్తగా.. దీటుగా స్పందించింది భారత్. జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత భారత్​తో సంబంధాలు మరింత సంక్షిష్టమయ్యాన్నారు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావాల్​ భుట్టో. దీనిపై భారత్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్ముకశ్మీర్ భారత్​లో అంతర్భాగమని పునరుద్ఘాటించింది. పాకిస్థాన్​ ప్రతి అంతర్జాతీయ వేదికను భారత వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకుంటోందని మండిపడింది.

Bilawal Bhutto On India: జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత భారత్​తో సంబంధాలు మరింత సంక్షిష్టమయ్యాయని అన్నారు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బ తీశాయని అభిప్రాయపడ్డారు. ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం, జెనీవా కన్వెన్షన్​ను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. ఆర్థిక కార్యకలాపాలు, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కారం అవుతాయని తాము అర్థం చేసుకున్నామన్నారు. కానీ ఇలాంటి దూకుడు ప్రవర్తన కారణంగా చర్చలు జరగడానికి అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు.

తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లిన భుట్టో గురువారం మీడియాతో మాట్లాడారు. గోధుమ ఎగుమతులపై భారత్​ నిషేధం విధించడంపై ఆయన స్పందించారు. అది భారత ప్రభుత్వ అంతర్గత నిర్ణయమని.. కానీ ఇలాంటి చర్యలు అంతర్జాతీయ సంస్థలను నిరుత్సాపరుస్తాయన్నారు. ఆహార భద్రత లక్ష్యాలను చేరుకోలేని వారి అవసరాలను తీర్చేందుకు మన మందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కశ్మీర్​ భారత్​లో అంతర్భాగం:​ జమ్ముకశ్మీర్​పై పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి బిలవాల్​ భుట్టో చేసిన వ్యాఖ్యలపై భారత్​ మండిపడింది. పాకిస్థాన్​ ప్రతి వేదికను భారత్​కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఉపయోగించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ భద్రతా మండలి నిర్వహించిన 'అంతర్జాతీయ శాంతి, ఆహార భద్రత' అంశంపై చర్చలో భారత శాశ్వత కౌన్సిలర్​ రాజేశ్​ పరిహార్​ స్పందించారు.

"కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​​.. భారత్​లో అంతర్భాగం. ఇందులో పాకిస్థాన్​ ఆక్రమించిన ప్రాంతాలు ఉన్నాయి. మీరు ఎన్ని విద్వేష పూర్వక ప్రసంగాలు చేసినా ఈ వాస్తవాన్ని కాదనలేరు. పాకిస్థాన్​ చేయగల ఏకైక సహకారం.. వారు ప్రోత్సహించే ఉగ్రవాదాన్ని అరికట్టడమే" ​

రాజేశ్​ పరిహార్, భారత శాశ్వత కౌన్సిలర్​

ఆర్టికల్​ 370ని రద్దు చేయడం తమ అంతర్గత విషయమని అంతర్జాతీయ సమాజానికి భారత్ స్పష్టంగా చెప్పింది. జమ్ము కశ్మీర్​ భారత్​లో అంతర్భాగమన్న వాస్తవాన్ని అంగీకరించాలని.. భారత్​ వ్యతిరేక ప్రచారాలని మానుకోవాలని హితవు పలికింది. ఉగ్రవాదం, హింస లేని సంబంధాలను తాము కోరుకుంటున్నామని పాకిస్థాన్​కు తెలిపింది.

జమ్ముకశ్మీర్​ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆర్టికల్​ 370ను భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాల దెబ్బతిన్నాయి. తర్వాత జరిగిన పరిణామాలతో జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్రం. మార్చి 2020లో జమ్ము కశ్మీర్​ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్​ను నియమించింది. ప్రస్తుతం కశ్మీర్​లో 46, జమ్ములో 37 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి అదనంగా జమ్ములో 6, కశ్మీర్​లో 1 అసెంబ్లీ స్థానాన్ని పెంచాలని కమిషన్ ప్రతిపాదించింది. అలాగే ఎస్సీలకు 7, ఎస్టీలకు 9 స్థానాలు కేటాయించింది.

ఇదీ చదవండి: సుత్తితో కొట్టి తండ్రి హత్య.. శరీరాన్ని ముక్కలుగా నరికి

Last Updated :May 20, 2022, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.