ETV Bharat / international

Israel Iron Sting : ఇజ్రాయెల్‌ 'ఐరన్‌ స్టింగ్‌'.. ఒకే రౌండ్‌తో లక్ష్యాలన్నీ ధ్వంసం!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2023, 11:05 AM IST

Israel Iron Sting : తమ దేశంపై మెరుపుదాడులతో హడలెత్తించిన హమాస్‌ను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్‌.. తన అమ్ములపొది నుంచి అత్యాధునిక ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. మధ్యప్రాచ్యంలో పొంచి ఉన్న ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకుగాను కచ్చితత్వంతో దాడిచేసే అస్త్రాన్ని డిజైన్‌ చేసింది. పౌరులు, వారి ఆస్తులకు నష్టం వాటిల్లకుండా ప్రత్యర్థి ఆయుధాలను, స్థావరాలను భస్మీపటలం చేసే ఇజ్రాయెల్‌ సరికొత్త ఆయుధం ఐరన్‌ స్టింగ్‌పై ప్రత్యేక కథనం.

Israel Iron Sting
Israel Iron Sting

Israel Iron Sting : హమాస్‌ మిలిటెంట్లపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌.. తన అమ్ములపొది నుంచి అత్యాధునిక ఆయుధాన్ని బయటికి తీసింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌, ఐరన్‌ బీమ్‌లను ఉపయోగించిన నెతన్యాహు సేన.. తాజాగా ఐరన్‌ స్టింగ్‌ అనే అత్యాధునిక ఆయుధ వ్యవస్థను ప్రత్యర్థిపై ఎక్కుపెట్టింది. గాజా పట్టీలో జనావాసాల మధ్య నుంచి రాకెట్లను ప్రయోగించే లాంచర్లను ధ్వంసం చేయడానికి 10రోజుల క్రితం నుంచి ఐరన్‌ స్టింగ్‌ అనే ఆయుధాన్ని వాడుతోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రకటించింది. తొలిసారి ఈ ఆయుధాన్ని వాడుతున్నట్లు పేర్కొని ఐరన్‌ స్టింగ్‌ దాడులకు సంబంధించిన చిత్రాలను పోస్టు చేసింది.

కచ్చితత్వంతో లక్ష్యాలను..
Iron Sting Israel : యుద్ధాల్లో వాడేందుకు ఐరన్‌ స్టింగ్‌ పేరిట 120ఎంఎం మోర్టార్‌ను ఇజ్రాయెల్‌ తయారు చేసింది. కాకపోతే దీనికి గైడెడ్‌ వ్యవస్థ ఉంటుంది. ఇది అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. భూతల ఆపరేషన్ల స్వరూపాన్నే పూర్తిగా మార్చేసే ఐరన్‌ స్టింగ్‌ను గేమ్‌ ఛేంజర్‌గా ఐడీఎఫ్‌ భావిస్తోంది. హమాస్‌ రాకెట్‌ లాంచర్లు, సొరంగాలపై పైచేయి సాధించటానికి ఐరన్‌ స్టింగ్‌ ఉపయోగపడుతుందని ఇజ్రాయెల్‌ గట్టి విశ్వాసంతో ఉంది.

గైడెడ్‌ వ్యవస్థతో శత్రు స్థావరాలను..
Iron Sting Mortar Bomb : సాధారణంగా మోర్టార్‌ గుండును పేల్చినప్పుడు.. అది లక్ష్యానికి కొంత అటూఇటుగా తాకుతుంది. ఈక్రమంలో పౌరులు, వారి ఆస్తులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కానీ, ఐరన్‌ స్టింగ్‌లోని గైడెడ్‌ వ్యవస్థతో శత్రు స్థావరాలను లేదా వారికి చెందిన వ్యవస్థలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేయవచ్చు. అత్యధిక జనాభాతో కిక్కిరిసిన గాజావంటి ప్రదేశాల్లో లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించడానికి ఐరన్‌స్టింగ్‌ అనువుగా ఉంటుంది.

ప్రజల మరణాలను..
Iron Sting Weapon Israel : హమాస్‌పై యుద్ధంలో ప్రజల మరణాలను వీలైనంతవరకు తగ్గించేందుకు ఇజ్రాయెల్‌ ఐరన్‌ స్టింగ్‌లను వాడుతోంది. ముఖ్యంగా మానవ కవచాలను వాడే హమాస్‌ను దెబ్బతీసేందుకు సరైన ఆయుధమని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్బిట్‌ సిస్టమ్స్‌ ఐరన్‌ స్టింగ్‌ను 2010లో అభివృద్ధి చేసింది. 2021లో దక్షిణ ఇజ్రాయెల్‌లో ఈ వ్యవస్థ నుంచి తొలిసారి జీపీఎస్‌, లేజర్‌ గైడెడ్‌ మోర్టార్‌ను చిన్నసైజులో ఉన్నలక్ష్యాలపై విజయవంతంగా ప్రయోగించింది. ఆ తర్వాత కచ్చితత్వానికి మరింత పదునుపెట్టింది. 2021-22లో ఐరన్‌ స్టింగ్‌ వ్యవస్థలను కొనుగోలు చేసింది. తమ సైన్యంలోని అత్యుత్తమ దళాల్లో ఒకటైన సైరెట్‌ మాగ్లాన్‌.. ఈ ఐరన్‌ స్టింగ్‌లను వాడుతున్నట్లు వాయుసేన ట్వీట్‌ ద్వారా తెలుస్తోంది.

ఒక్కరౌండ్‌తో లక్ష్యాలపై..
Iron Sting Wikipedia : సంప్రదాయ మోర్టార్‌తో ఒక్కరౌండ్‌తో లక్ష్యాలపై దాడిచేయడం కష్టమనే చెప్పాలి. కానీ, ఐరన్‌ స్టింగ్‌లోని గైడెడ్‌ మోర్టార్‌తో ఒకే రౌండ్‌తో అనుకున్న లక్ష్యాలను ధ్వంసం చేయొచ్చు. ఫలితంగా అదనపురౌండ్ల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అంతేకాదు అత్యంత కచ్చితత్వంతో జరిగే ఈ దాడితో శత్రువు బెంబేలెత్తుతాడు. దీంతో ప్రత్యర్థి గ్రూపు మానసికంగా కుంగిపోయి గందరగోళంలో పడుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Israel Gaza War : గాజాలో ఒక్కరోజే 700మంది మృతి.. ఆస్పత్రులన్నీ బంద్​!.. WHO ఆందోళన

Gaza Hospitals Fuel : ఆస్పత్రుల్లో ఇంధనం ఖాళీ!..'పెను విపత్తుకు దగ్గర్లో గాజా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.