ETV Bharat / international

భారత్‌ చేతికి స్విస్‌ ఖాతాల నాలుగో జాబితా.. పెరిగిన లక్ష అకౌంట్లు

author img

By

Published : Oct 11, 2022, 7:37 AM IST

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయ పౌరులు/సంస్థలకు చెందిన అకౌంట్ల వివరాలతో కూడిన నాలుగో జాబితా కేంద్ర ప్రభుత్వానికి చేరింది. స్విట్జర్లాండ్‌తో కుదుర్చుకున్న సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా బ్యాంకు అకౌంట్లకు సంబంధించి తాజా జాబితాను అందించింది.

swiss bank account holders in india
swiss bank account holders in india

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయ పౌరులు/సంస్థలకు చెందిన అకౌంట్ల వివరాలతో కూడిన నాలుగో జాబితా భారత్‌కు చేరింది. అందులో వ్యాపారస్థులతోపాటు కార్పొరేట్‌లు, ట్రస్టులకు చెందిన వందల అకౌంట్ల వివరాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. స్విట్జర్లాండ్‌తో కుదుర్చుకున్న సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా బ్యాంకు అకౌంట్లకు సంబంధించి తాజా జాబితాను అందించింది.

అటోమేటిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఎక్ఛేంజ్‌లో భాగంగా ప్రతిఏటా ఈ జాబితా స్విట్జర్లాండ్‌ అందిస్తుండగా.. తాజాగా 101 దేశాలకు చెందిన 34లక్షల అకౌంట్ల వివరాలను విడుదల చేసింది. ఈ జాబితాలో కొత్తగా నైజీరియా, పెరూ, టర్కీ, అల్బేనియా, బ్రూనీ వంటి దేశాలు చేరినట్లు ఫెడరల్‌ టాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది. దీంతో దాదాపు లక్ష అకౌంట్లు పెరిగినట్లు తెలిపింది. అయితే, 101 దేశాల పేర్లు, వాటి అకౌంట్ల వివరాలను బహిరంగంగా చెప్పనప్పటికీ ఆ జాబితాలో భారత్‌ ఉందని ఎఫ్‌టీఏ పేర్కొంది. ఆ వివరాలను ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే భారత ప్రభుత్వానికి అందించినట్లు వెల్లడించింది.

ఏఈఓఐలో భాగంగా స్విట్జర్లాండ్‌లో మన దేశస్థుల అకౌంట్ల వివరాలతో కూడిన తొలి జాబితా 2019లో అందింది. ఆ ఏడాది మొత్తం 75 దేశాలకు చెందిన అకౌంట్ల జాబితాను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం 2020 సెప్టెంబర్‌లో రెండో జాబితా, 2021 మూడో జాబితాలో 86 దేశాల వివరాలను వెల్లడించింది. ఐడీ, పేరు, అడ్రస్‌, నివాస దేశం, టాక్స్‌ ఐడీ, సంస్థకు చెందిన వివరాలు, అకౌంట్లో నగదు, మూలధనం వంటి అకౌంట్‌ వివరాలు ఆయా ప్రభుత్వాలకు అందించిన నివేదికలో ఉంటాయని ఎఫ్‌టీఏ తెలిపింది. అయితే, 2018 ఆ తర్వాత క్రియాశీలంగా ఉన్న అకౌంట్ల వివరాలు మాత్రమే ఎఫ్‌టీఏ వెల్లడిస్తోంది.

ఇవీ చదవండి: బ్యాంకులపై పరిశోధనలకు పురస్కారం.. ముగ్గురు నిపుణులకు ఆర్థికశాస్త్ర నోబెల్

ఉక్రెయిన్​లో అంధకారం.. ఇది ట్రైలర్ మాత్రమేనన్న రష్యా.. భారత్ ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.