ETV Bharat / international

తర్వాతి ఎన్నికల్లో ట్రంప్​కే ఓటేస్తా!: మస్క్

author img

By

Published : May 20, 2022, 5:10 AM IST

Elon Musk Vote Republican: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకే ఓటు వేస్తానని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. గతంలో డెమొక్రాట్లకు ఓటేశానని చెప్పిన ఆయన.. ఇకపై వారికి తన మద్దతు ఇవ్వనంటూ చెప్పుకొచ్చారు.

Elon Musk Vote Republican
ELON MUSK VOTE

Elon Musk Vote Republican: ప్రపంచ పరిణామాలపై నిత్యం స్పందించే ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. ఇటీవల అమెరికా రాజకీయాలపై తన స్వరం పెంచుతున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికలను ప్రస్తావించిన ఆయన.. క్రితం ఎన్నికల్లో తాను డెమొక్రాట్‌లకు ఓటు వేసినప్పటికీ ఈసారి మాత్రం రిపబ్లికన్లకే ఓటు వేస్తానని స్పష్టం చేశారు. డెమొక్రాట్‌లు అంటే సౌమ్యంగా ఉండేవారని.. అందుకే గతంలో వారికి ఓటు వేశానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న జోబైడెన్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎలాన్ మస్క్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Elon Musk Democrats Support: 'గతంలో డెమొక్రాట్లకే ఓటు వేశాను. ఎందుకంటే ఇంతకుముందు వారు సౌమ్యమైన పార్టీ వ్యక్తులుగా ఉండేవారు. కానీ ప్రస్తుతం విభజన, ద్వేషం పెంచే పార్టీగా తయారవుతోంది. అందుకే ఇక నుంచి వారికి మద్దతు ఇవ్వను. రిపబ్లికన్‌ పార్టీకే ఓటు వేస్తాను. ఇక ఇప్పుడు నాకు వ్యతిరేకంగా చెడు ప్రచారం ఎలా చేస్తారో చూడండి’ అంటూ జో బైడెన్‌ పార్టీని ఉద్దేశిస్తూ ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. రాజకీయ పరంగా తనపై పెరుగుతున్న విమర్శలను ఉదహరించిన ఆయన రానున్న మరికొన్ని నెలల్లో తనపై రాజకీయ దాడులు మరింత పెరగుతాయని ఇటీవల మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

అమెరికా దిగ్గజ వ్యాపారస్థుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌.. జో బైడెన్‌ ప్రభుత్వంపై చాలా రోజుల నుంచి విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ కార్ల పన్నుల విధానం విషయంలో బైడెన్‌ ప్రభుతాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇదే సమయంలో రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డొనాల్డ్‌ ట్రంప్‌పై ట్విటర్‌ నిషేధాన్ని వెనక్కి తీసుకుంటానని ఎలాన్‌ మస్క్‌ పేర్కొనడం విశేషం.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.