కేవలం స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్‌ వ్యాపిస్తుందా? అందులో నిజమెంత?

author img

By

Published : Jul 27, 2022, 5:25 AM IST

Updated : Jul 27, 2022, 6:51 AM IST

monkey pox

Monkeypox: ప్రపంచ దేశాలను మరోసారి వణికిస్తోన్న మంకీపాక్స్‌ వైరస్‌ కేవలం స్వలింగ సంపర్కం, లైంగిక కలయికతోనే వ్యాపిస్తుందా?.. వైరస్​ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నా సోకుతుందా? కరోనా వైరస్​తో మంకీపాక్స్​ను పోల్చవచ్చా? వీటిన్నంటిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ క్లారిటీ ఇచ్చారు.

Monkeypox: ప్రపంచ దేశాలను మరోసారి వణికిస్తోన్న మంకీపాక్స్‌ వైరస్‌ కేవలం స్వలింగ సంపర్కం, లైంగిక కలయికతోనే వ్యాపించదని ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ పేర్కొన్నారు. వైరస్‌ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడం వల్లే ప్రధానంగా ఇది వ్యాప్తి చెందుతుందన్నారు. వ్యక్తి శరీరం, నోరు, ముఖాన్ని తాకడంతోపాటు నోటి తుంపర్ల ద్వారా ఇది వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. ప్రధానంగా ఇది స్వలింగ సంపర్కుల్లోనే తొలుత బయటపడినప్పటికీ.. తల్లి నుంచి పిల్లలకు, కుటుంబ సభ్యుల్లో వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాప్తిచెందే ఆస్కారం ఉందన్నారు. ప్రపంచ దేశాలతోపాటు భారత్‌లోనూ మంకీపాక్స్‌ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో.. జాతీయ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ ఈ వివరాలు వెల్లడించారు.

'కరోనా వైరస్‌తో మంకీపాక్స్‌తో పోల్చలేము'.. కరోనా వైరస్‌తో మంకీపాక్స్‌తో పోల్చలేమని.. అయినప్పటికీ ప్రస్తుతం మంకీపాక్స్‌ తీవ్రత తక్కువగానే ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ పేర్కొన్నారు. మంకీపాక్స్‌పై ఇప్పటివరకు ఉన్న సమాచారం తక్కువేనని.. వైరస్‌లో మార్పులు, ప్రాబల్యానికి సంబంధించి ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 16వేల కేసులు నమోదైనప్పటికీ ఐదు మరణాలు మాత్రమే సంభవించిన విషయాన్ని గుర్తించారు. అయితే, గుర్తించని కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు.

'మంకీపాక్స్‌ మనకొక మేల్కొలుపు'.. ఇక మంకీపాక్స్‌ కూడా స్మాల్‌పాక్స్‌ మాదిరి వైరస్‌ అని.. అయితే, తొలితరం వ్యాక్సినేషన్‌ వల్ల 1978-80 నాటికే స్మాల్‌ఫాక్స్‌ నిర్మూలించబడిందన్నారు. 1980 తర్వాత జన్మించిన తరం స్మాల్‌పాక్స్‌ వ్యాక్సిన్‌ తీసుకోలేదని డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ గుర్తుచేశారు. దీంతో ఆ వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధకత కూడా లేదనే చెప్పవచ్చన్నారు. ఇటువంటి నేపథ్యంలో మంకీపాక్స్‌ మనకొక మేల్కొలుపు అని అన్నారు. ఇదే సమయంలో మంకీపాక్స్‌తో పాటు ఆయా దేశాల్లో స్మాల్‌పాక్స్‌కు సంబంధించి ఉన్న పూర్తి సమాచారం కూడా సేకరించాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి: చైనా దారిలోనే రష్యా... అంతరిక్ష కేంద్రానికి గుడ్​బై!

శ్రీలంకకు తిరిగిరానున్న గొటబాయ.. మోదీ కీలక సందేశం!

Last Updated :Jul 27, 2022, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.