ETV Bharat / international

9 మంది పిల్లలకు తండ్రైన 'మస్క్'​.. జననాల రేటు పెంచేందుకేనట!

author img

By

Published : Jul 8, 2022, 9:49 AM IST

Updated : Jul 8, 2022, 10:23 AM IST

elon musk children
ఎలాన్​ మస్క్​

Elon Musk Children: టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్​ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూరాలింక్‌ కంపెనీలో పనిచేస్తున్న శివోన్‌ జిలిస్‌తో కలిసి గతేడాది కవలలకు జన్మనిచ్చినట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. 'ప్రస్తుతం ఉన్న సంక్షోభాలలో జననాల రేటు తగ్గిపోవడం అతి పెద్ద సమస్య. తరుగుతున్న జనాభా సంక్షోభానికి నా వంతు కృషి చేస్తున్నాను' అని ఎలాన్​ ట్వీట్​ చేశారు.

ELON MUSK CHILDREN: న్యూరాలింక్‌ కంపెనీలో పనిచేస్తున్న శివోన్‌ జిలిస్‌తో కలిసి గతేడాది కవలలకు జన్మనిచ్చినట్లు వస్తున్న వార్తలపై టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. "ఇప్పుడున్న వాటిల్లో జననాల రేటు తగ్గిపోవడం అతి పెద్ద సమస్య. తరుగుతున్న జనాభా సంక్షోభానికి నా వంతు కృషి చేస్తున్నాను. జననాల రేటు తగ్గి జనాభా సంక్షోభం దిశగా పయనిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నప్పటికీ.. భూమిపై జనాభా పెరిగిపోతుందని చాలా మంది భ్రమ పడుతున్నారు. అంగారకుడిపై జనాభా జీరో ఉంది. మీకు కూడా పెద్ద కుటుంబాలు ఉండాలని ఆశిస్తున్నాను. ఇప్పటికే కలిగి ఉన్నవారికి అభినందనలు" అని మస్క్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఉండాల్సిన జననరేటు కంటే గత 50 ఏళ్లలో అమెరికాలో తక్కువగా ఉందని, దానికి సంబంధించిన గణాంకాల గ్రాఫ్‌ను ట్వీట్ చేశారు.

elon musk children
.

మస్క్‌ ఇప్పటికే తన మాజీ భార్య జస్టిన్‌ విల్సన్‌తో ఐదుగురు పిల్లలకు, కెనడా సింగర్‌ గ్రైమ్స్‌తోనూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. గత ఏడాది డిసెంబరులోనే మస్క్‌, గ్రైమ్స్‌ కలిసి సరోగసీ ద్వారా తమ రెండో బిడ్డకు ఆహ్వానం పలికారు. ఇటీవల ఇద్దరు కవలలతో కలిపి మొత్తం 9 మందికి ఎలాన్‌ మస్క్‌ తండ్రి అయ్యారు.

elon musk children
.
elon musk children
.

మస్క్‌, జిలిస్‌ కలిసి ఏప్రిల్‌ 2022లో తమ పిల్లల పేరు మార్పుపై కోర్టును ఆశ్రయించారు. తమ పేర్లలోని చివరి పదాన్ని పిల్లల పేర్లలో ఉండేలా మార్చేందుకు అనుమతించాలని కోరినట్లు కోర్టు పత్రాల ద్వారా తెలిసిందని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ పత్రిక పేర్కొంది. దీనికి కోర్టు ఆమోదం లభించినట్లు ప్రచురించింది.

ఇవీ చదవండి: అప్పుడు 'వన్​ మ్యాన్​ షో'తో అఖండ విజయం.. ఇప్పుడు అతివిశ్వాసంతో రాజకీయ పతనం!

'కాళీ' దర్శకురాలి పోస్టుపై ట్విట్టర్‌ కొరడా.. కెనడా మ్యూజియం క్షమాపణలు

Last Updated :Jul 8, 2022, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.