ETV Bharat / international

Canada Diplomatic Immunity : దౌత్యవేత్తల ఉపసంహరణపై కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలు.. భారత్​ స్ట్రాంగ్​ కౌంటర్​

author img

By PTI

Published : Oct 21, 2023, 6:50 AM IST

Updated : Oct 21, 2023, 7:13 AM IST

Canada Diplomatic Immunity : కెనడా దౌత్యవేత్తలపై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో. భారత్‌ నిర్ణయం దౌత్యం ప్రాథమిక సూత్రానికి, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన భారత్​.. కెనడాకు స్ట్రాంగ్​ కౌంటర్ ఇచ్చింది.

Canada Diplomatic Immunity
Canada Diplomatic Immunity

Canada Diplomatic Immunity : 41 మంది కెనడా దౌత్యవేత్తలకు దౌత్యపరమైన రక్షణను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం.. వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. కెనడా దౌత్యవేత్తలపై భారత్ అనుసరించిన వైఖరి రెండు దేశాల్లోని లక్షలాది మంది జీవితాల్ని దుర్భరం చేస్తుందని ట్రూడో వ్యాఖ్యానించారు. భారత్‌ నిర్ణయం దౌత్యం ప్రాథమిక సూత్రానికి, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని బ్రాంప్టన్‌లో పేర్కొన్నారు. 62 మంది దౌత్య సిబ్బందిలో 41 మందిని ఉపసంహరించకపోతే వారికి అందించే దౌత్యపరమైన రక్షణను తొలిగిస్తామని భారత్ అంతకుముందు హెచ్చరించింది. దీంతో భారత్‌లోని తమ దౌత్య సిబ్బందిలో 41 మందిని వెనక్కు రప్పించుకున్నట్లు కెనడా అధికారికంగా ప్రకటించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి.

కెనడాకు దీటుగా బదులిచ్చిన భారత్‌
మరోవైపు భారత అల్టిమేటం అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ కెనడా అక్కసు వెళ్లగక్కడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్ట్రాంగ్​ కౌంటర్ ఇచ్చింది. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్‌ 11.1 నిబంధనలకు అనుగుణంగానే.. దౌత్యసిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపింది. భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని.. దిల్లీ, ఒట్టావా దౌత్య సంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలని మేం కోరుకుంటున్నామని చెప్పింది.

  • MEA issues statement, "We have seen the Statement by the Government of Canada on October 19 regarding Canadian diplomatic presence in India. The state of our bilateral relations, the much higher number of Canadian diplomats in India, and their continued interference in our… pic.twitter.com/6tKlgepHVG

    — ANI (@ANI) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత్ నిర్ణయం ఆందోళకరం : అమెరికా
మరోవైపు భారత్ నిర్ణయంపై ఆందోళ వ్యక్తం చేసింది అగ్రరాజ్యం అమెరికా. కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని పట్టుపట్టకూడదని కోరింది. 1961 వియన్నా ఒప్పందాన్ని భారత్​ అనుసరిస్తుందని ఆశిస్తున్నామని చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న కెనడా దర్యాప్తుకు భారత్​ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

  • We are concerned by the departure of Canadian diplomats from India, in response to the Indian government’s demand of Canada to significantly reduce its diplomatic presence in India. Resolving differences requires diplomats on the ground. We have urged the Indian government not to… pic.twitter.com/wWmwcoSe1n

    — ANI (@ANI) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'భారత్‌లో ఆ నగరాల్లో జాగ్రత్త'
భారత్‌లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ జారీ చేసి కెనడా మరోసారి కవ్వింపులకు పాల్పడింది. "ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో.. భారత్‌లో మీడియా, సామాజిక మాద్యమాల్లో కెనడాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కెనడా-వ్యతిరేక ఆందోళనలు, ప్రదర్శనలు జరిగే అవకాశాలున్నాయి. కెనడియన్లపై వేధింపులు, బెదిరింపులు జరగొచ్చు. అందువల్ల దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో కొత్త వ్యక్తులతో కెనడియన్లు జాగ్రత్తగా ఉండండి. వారికి ఎలాంటి వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. బెంగళూరు, చండీగఢ్‌, ముంబయిల్లోనూ అప్రమత్తంగా ఉండండి" అని కెనడా తన అడ్వైజరీలో చెప్పింది.

Canada Diplomats India : భారత్​ వార్నింగ్​కు తలొగ్గిన కెనడా.. 41 మంది దౌత్యవేత్తలు వెనక్కి..

Khalistan Nijjar Killed : 'నిజ్జర్​ హత్యలో చైనా ఏజెంట్ల ప్రమేయం.. ఇండియన్ ఇంగ్లిష్ నేర్చుకొని మరీ..'

Last Updated :Oct 21, 2023, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.