ETV Bharat / international

రెచ్చిపోయిన మాఫియా.. నగర మేయర్​ సహా 18 మంది హత్య

author img

By

Published : Oct 6, 2022, 9:06 AM IST

Updated : Oct 6, 2022, 9:26 AM IST

నగర మేయర్​ సహా మొత్తం 18 మందిని కాల్చి చంపారు సాయుధ దుండగులు. ఈ ఘటన మెక్సికోలోని గుర్రెరోలో బుధవారం మధ్యాహ్నం జరిగింది.

mexico shootout today
రెచ్చిపోయిన మాఫియా.. నగర మేయర్​ సహా 18 మంది హత్య

మెక్సికోలో కొందరు సాయుధ దుండగులు పెను బీభత్సం సృష్టించగా 18 మంది మరణించారు. మృతుల్లో సాన్ మిగ్వేల్ టోటోపాలన్​ నగర మేయర్ కూడా ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకాకం బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన.. అక్కడి మాఫియా పనేనని అనుమానిస్తున్నారు.

గుర్రెరో రాష్ట్రం సాన్​ మిగ్వేల్​ టోటోపాలన్​ నగరంలోని సిటీ హాల్ వద్ద అనేక మంది సాయుధ దుండగులు ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరపగా అనేక మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Last Updated : Oct 6, 2022, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.