ETV Bharat / international

బ్రిటన్ కొవిడ్ రూల్స్​.. లిస్ట్​లో లేని భారత్​!

author img

By

Published : Oct 5, 2021, 5:20 AM IST

Updated : Oct 5, 2021, 6:30 AM IST

విదేశీ ప్రయాణికుల కోసం బ్రిటన్ ప్రభుత్వం సరళించిన నిబంధనల్లోనూ భారత్​కు చుక్కెదురైంది. బ్రిటన్​లోకి అనుమతించే విదేశీ ప్రయాణికుల జాబితాలో భారత్ పేరును ప్రస్తావించలేదు. మరోవైపు బ్రిటన్​ నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్​ను(India UK quarantine rules) తప్పనిసరి చేసింది భారత ప్రభుత్వం.

covid
కొవిడ్

విదేశీ ప్రయాణికుల కోసం బ్రిటన్ తీసుకొచ్చిన కొవిడ్ నిబంధనలపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చిన క్రమంలో రూల్స్​ను సరళీకృతం చేసింది ఆ దేశ ప్రభుత్వం. కానీ భారత్​కు మాత్రం ఎలాంటి లాభం చేకూరలేదు. బ్రిటన్​ సరళించిన నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. బ్రిటన్​లోకి అనుమతించే విదేశీ ప్రయాణికుల జాబితాలో భారత్ పేరును ప్రస్తావించలేదు. కొవిషీల్డ్ టీకా తీసుకున్నప్పటికీ భారత ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం.

అంతకుముందు.. భారత్​పై బ్రిటన్ ఆంక్షలు విధించిన క్రమంలో.. బ్రిటన్​ నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్​ను(India UK quarantine rules) తప్పనిసరి చేశాయి అధికార వర్గాలు. ఈ నెల 4 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

" మేము భారత్​తో పాటు.. అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తున్నాం. నిబంధనలను దశలవారీగా తొలగిస్తాం."

-- బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి

భారత్​ నిబంధనల ప్రకారం బ్రిటన్​ నుంచి వచ్చే వారు ప్రయాణానికి ముందు ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు (India UK quarantine rules) చేయించుకోవడం తప్పనిసరి. అదే విధంగా వారు భారత్​కు వచ్చి ఎనిమిది రోజులు పూర్తయ్యాక మరోసారి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: Pandora Papers Leak: 'పన్ను ఎగవేత మార్గాలను నిర్మూలించాలి'

Last Updated : Oct 5, 2021, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.