ETV Bharat / international

Monkeypox: బ్రిటన్​లో మరో కొత్త వ్యాధి!

author img

By

Published : Jun 15, 2021, 6:33 AM IST

Updated : Jun 15, 2021, 10:06 AM IST

ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న సమయంలో బ్రిటన్​లో మరో ప్రమాదకర వైరస్​ పుట్టుకొచ్చింది. మంకీపాక్స్​ అనే ఈ అరుదైన వ్యాధి వ్యాప్తి ఇప్పుడు పెరుగుతోంది. అసలు ఈ వ్యాధి ఏంటి? దీనికి చికిత్స ఉందా?

monkeypox
యూకేలో మరో ప్రమాదకర వ్యాధి!

వివిధ రకాల స్ట్రెయిన్లు పుట్టుకొస్తూ ప్రపంచంలో అనేక చోట్ల కరోనా కలవరపెడుతున్న వేళ బ్రిటన్​లో మరో ప్రమాదకర వైరస్​ బయటపడింది. మంకీపాక్స్(Monkeypox)​గా పిలిచే ఈ వ్యాధి వ్యాప్తిపై స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్​ కేసులను అధికారులు గుర్తించగా తాజాగా మరో రెండు ఆ జాబితాలో చేరాయి.

ఉత్తర ఐర్లాండ్​, యునైటెడ్​ కింగ్​డమ్​లో ఈ మంకీపాక్స్​ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్​ సోకిన వారికి ప్రస్తుతం ఇంగ్లాండ్​లో చికిత్స అందిస్తున్నారు.

మంకీపాక్స్​ అంటే?

మంకీపాక్స్​ అనేది జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్​ వ్యాపించే అవకాశాలు ఎక్కువ. ఇది కరోనా తరహాలోనే ఒకరి నుంచి శ్వాసకోస బిందువుల ద్వారా సోకుంది. వ్యాధి సోకిన వారిని తాకినా.. మంకీపాక్స్​ వ్యాపించే అవకాశం ఉంది. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు వెల్లడించారు.

దీని లక్షణాలు ఏంటి?(Monkeypox symptoms)

జ్వరం, తలనొప్పి, వాపులు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట మంకీపాక్స్​ లక్షణాలు. జ్వరం వచ్చే సమయంలో చర్మంపైన దద్దుర్లు​ కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇవి​ సాధారణంగా అరచేతులు, అరిపాదాల్లో వస్తుంటాయి. దీని ద్వారా విపరీతమైన దురద లేదా నొప్పి కలుగుతాయి. ఒక్కోసారి మచ్చలు కూడా ఏర్పడవచ్చు.

ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి. మైల్డ్​ కేసుల్లో లక్షణాలు కనించవు. ఇలాంటి సందర్భాల్లో ఓ వ్యక్తి నుంచి మరోవ్యక్తికి వ్యాప్తికి అవకాశాలు పెరుగుతాయి.

మరి దీనికి చికిత్స ఉందా?(Monkeypox treatment)

ప్రస్తుతం మంకీపాక్స్​ను పూర్తిగా నయం చేసేందుకు సురక్షితమైన చికిత్స ఏదీ లేదని అమెరికాకు చెందిన సెంటర్స్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​ వెల్లడించింది. ఈ చికిత్సకు స్మాల్​పాక్స్​ వ్యాక్సిన్​, యాంటీవైరల్స్​ వంటి ఔషధాలు వాడొచ్చని సూచించింది.

ఇదీ చదవండి : కరోనాతో 243 రోజులు పోరాడినా..!

Last Updated :Jun 15, 2021, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.