ETV Bharat / international

'నాన్న ఇచ్చిన విస్కీ అమ్మేసి.. ఇల్లు కొనేస్తా!'

author img

By

Published : Sep 8, 2020, 2:40 PM IST

సొంతింట కల నెరవేర్చుకునేందుకు నాన్న బహుమతిగా ఇచ్చిన విస్కీ బాటిళ్లను అమ్మకానికి పెట్టాడు బ్రిటన్ కు చెందిన ఓ యువకుడు. ఇల్లు కొనేంత డబ్బు వస్తోందంటే.. వందలాది విస్కీ సీసాలు ఉన్నాయనుకుంటారేమో. కాదు! ఉన్నవి, కేవలం 28 బాటిళ్లే. కానీ, వాటి ధర మాత్రం దాదాపు రూ.39 లక్షలు. ఇంతకీ, ఆ విస్కీలో అంత ప్రత్యేకత ఏంటి?

uk-man-selling-birthday-whisky-collection-to-buy-home
'నాన్న ఇచ్చిన విస్కీ బాటిళ్లు అమ్మేసి.. ఇల్లు కొనేస్తా!'

ఏ తండ్రైనా కుమారుడు వ్యసనాలకు బానిసవ్వకూడదనుకుంటారు. కొంతమంది పిల్లల ముందు మద్యం కూడా సేవించరు. కానీ, బ్రిటన్​కు చెందిన పిటే మాత్రం... కుమారుడు మాథ్యూ రాబ్సన్ ప్రతి పుట్టిన రోజుకు బహుమతిగా విస్కీ బాటిళ్లే కొనిచ్చాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 28 ఏళ్లు బహూకరించాడు. ఆ విస్కీ బహుమతులే ఇప్పుడు మాథ్యూకి ఓ ఇంటిని కొనిపెడుతున్నాయి మరి.

స్కాట్లాండ్ మిల్నాతోర్ట్​కు చెందిన పిటే ఇంట 1992లో మాథ్యూ రాబ్సన్ జన్మించాడు. మాథ్యూ పుట్టినప్పుడు ఇంట్లో సంబరం చేసుకునేందుకు 18 ఏళ్లు పురాతనమైన విస్కీని కొని తెచ్చాడు పీటె. అప్పుడే తనకో వినూత్న ఆలోచన వచ్చింది. తనయుడికి ప్రతి పుట్టిన రోజుకు తానో విస్కీ బాటిల్ కొనిస్తే కొత్తగా ఉంటుందనిపించింది. అనుకున్నట్టే, ఏటా సుమారు 5 పౌండ్లు ఖర్చు చేసి 'మెకాల్లన్ సింగిల్ మాల్ట్' బ్రాండ్ విస్కీ సీసా మాథ్యూకిచ్చాడు.

"ఏటా పుట్టినరోజు బహుమతిగా విస్కీ ఇస్తే కాస్త కొత్తగా ఉంటుందని ఆలోచించి ఆలా ఏటా విస్కీ బాటిళ్లు కొనిచ్చా. అయితే, అది కేవం వినూత్న బహుమతే కాదు. విస్కీతో మాకు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చింది. "

-పిటే

నాన్న ఇచ్చిన బాటిళ్లను తాగేయకుండా.. ఎంతో భద్రంగా దాచుకున్నాడు మాథ్యూ. ఇప్పుడు మాథ్యూ వయసు 28 ఏళ్లు. మాథ్యూతో పాటు విస్కీ ధరలూ విపరీతంగా పెరిగాయి. ఈ సమయంలో తన దగ్గరున్న బాటిళ్లను అమ్మేస్తే సుమారు రూ.39 లక్షలు వస్తాయి. అందుకే, ఆ బాటిళ్లను అమ్మేసి నాన్న గుర్తుగా ఓ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాడు మాథ్యూ.

ఇదీ చదవండి: తొలిపలుకులు పలికే వేళ.. బాల వికాసం ఇలా..!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.