ETV Bharat / international

'కరోనాకు హెర్డ్ ఇమ్యూనిటీ అప్పుడే సాధ్యం'

author img

By

Published : Aug 19, 2020, 5:06 AM IST

కరోనా వైరస్​ మహమ్మారికి హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచ జనాభాలో హెర్డ్ ఇమ్యూనిటీకి అవసరమైన స్థాయిలో కరోనా ప్రతిరోధకాలు లేవని తెలిపింది. అయితే సమర్థమైన టీకాతో దీన్ని సాధించవచ్చని పేర్కొంది.

VIRUS-WHO-IMMUNITY
హెర్డ్ ఇమ్యూనిటీ

కరోనా వైరస్​కు హెర్డ్​ ఇమ్యూనిటీ (మంద రోగ నిరోధక శక్తి) సాధించే అవకాశాలు చాలా తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇందుకు అవసరమైన స్థాయిలో ప్రజల్లో ప్రతినిరోధకాలు లేవని తెలిపింది. అందువల్ల హెర్డ్​ ఇమ్యూనిటీపై ఆశలు పెట్టుకోలేదని డబ్ల్యూహెచ్​ఓ అత్యవసర విభాగం చీఫ్ డాక్టర్ మైఖేల్ రియాన్ స్పష్టం చేశారు.

వైరస్​ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి జనాభాలో కనీసం 70 శాతం మందికి ప్రతిరోధకాలు ఉండాలని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సగం మందికి రోగనిరోధక శక్తి ఉన్నప్పటికీ హెర్డ్​ ఇమ్యూనిటీ సాధించవచ్చని మరికొందరు వాదిస్తున్నారు.

వ్యాక్సినేషన్​తో..

ప్రస్తుతం ఉన్న అధ్యయనాల ప్రకారం కరోనాకు 10 నుంచి 20 శాతం మందిలోనే యాంటీబాడీలు ఉండవచ్చని తెలిపారు. ప్రపంచ జనాభాలో 50 శాతం మందికి వ్యాక్సిన్​ అందివ్వగలిగితే ఉపయోగకరంగా ఉంటుందని డబ్ల్యూహెచ్​ఓ సలహాదారు డాక్టర్ బ్రూస్ ఐల్వార్డ్​ తెలిపారు.

ఇదీ చూడండి: కరోనా ఉద్ధృతి: మిలియన్ జనాభాలో 100 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.