ETV Bharat / international

కరోనాపై యుద్ధానికి జీ-20 దేశాల అత్యవసర భేటీ

author img

By

Published : Mar 26, 2020, 5:41 AM IST

కరోనా కట్టడిపై చర్చించేందుకు జీ-20 దేశాధినేతలు నేడు సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే ఈ సమావేశానికి సౌదీ రాజు సల్మాన్​ బిన్​ అబ్దుల్ అజీజ్ అల్​ సౌద్​ అధ్యక్షత వహిస్తారు. మహమ్మారి నివారణకు అంతర్జాతీయంగా ఎలాంటి పాత్ర పోషించాలన్న విషయమై చర్చిస్తామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు.

g20 nations
జీ20 దేశాధినేతలు

ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా వైరస్ నియంత్రణపై చర్చించేందుకు నేడు జీ-20 దేశాల అధినేతలు సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు.

అత్యసవరంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్​ అల్​ సౌద్ నేతృత్వం వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, ఆర్థిక వ్యవస్థలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న మహమ్మారిని నిరోధించేందుకు సమన్వయంతో ఎలా పనిచేయాలన్న విషయమై వీరంతా చర్చిస్తారు.

ఎదురుచూస్తున్నా..

జీ-20 సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని, కొవిడ్‌-19 మహమ్మారి నివారణకు అంతర్జాతీయంగా ఎలాంటి పాత్ర పోషించాలన్న విషయమై ఈ సందర్భంగా చర్చిస్తామని మోదీ ట్వీట్‌ చేశారు. ఇందులో జీ-20 నేతలతో పాటు ఆహ్వానిత దేశాలైన స్పెయిన్‌, జోర్డాన్‌, సింగపూర్‌, స్విట్జర్లాండ్‌ ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ సంస్థలూ..

దేశాధినేతలతో పాటు అంతర్జాతీయ సంస్థల అధిపతులు భాగం పంచుకోనున్నారు. ఐరాస, ప్రపంచ బ్యాంక్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌, ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ బోర్డు, అంతర్జాతీయ కార్మిక సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.

మాంద్యం తప్పదు..

పారిశ్రామికంగా ఎంతో ముందున్న జీ-20 దేశాల్లో కరోనా కారణంగా ఆర్థిక మాంద్యం తప్పదని రేటింగ్స్​ సంస్థ మూడీస్ వెల్లడించింది. జీ-20 దేశాల జీడీపీ వృద్ధిరేటు కూడా 0.5శాతం మేర తగ్గనుందని స్పష్టం చేసింది. ఈ కూటమిలోని అమెరికా వృద్ధి రేటు 2 శాతం, ఐరోపా దేశాల వృద్ధిరేటు 2.2 శాతం కుచించుకుపోతుందని తెలిపింది.

ఇదీ చూడండి: బ్రిటన్ యువరాజు చార్లెస్​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.