ETV Bharat / international

బ్రిటన్​ రాణికి మళ్లీ అనారోగ్యం- కీలక కార్యక్రమానికి దూరం

author img

By

Published : Nov 14, 2021, 4:17 PM IST

Queen sprains back, won't attend Remembrance Sunday event
బ్రిటన్ మహారాణి

బ్రిటన్ మహారాణి ఎలిజబెత్​-2.. కీలక సంస్మరణ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. కొద్ది కాలంగా సమావేశాలకు దూరంగా ఉంటున్న ఆమె.. మరోసారి అనారోగ్యం బారినపడినందు వల్లే రెండో ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు బకింగ్​హామ్ ప్యాలెస్ ప్రకటనలో తెలిపింది. అయితే రాజకుటుంబంలోని మిగతా సభ్యులు మాత్రం కార్యక్రమానికి హాజరవుతున్నారు.

సెంట్రల్​ లండన్​లో ఆదివారం జరిగే సంస్మరణ కార్యక్రమానికి బ్రిటన్​ రాణి ఎలిజబెత్​-2 వెన్ను నొప్పి కారణంగా హాజరుకావడం లేదని బకింగ్​హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకు ఆమె ఎంతగానో చింతిస్తున్నట్లు ప్యాలెస్ అధికారులు పేర్కొన్నారు.

వైద్యుల సూచన మేరకు కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాల్లో 95 ఏళ్ల ఎలిజబెత్ పాల్గొనడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత ఆమె పాల్గొనె తొలి కార్యక్రమం ఇదే అవుతుందని అంతా భావించారు. కానీ ఇంతలోనే మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. అయితే మునుపటిలా సంస్మరణ కార్యక్రమంలో ఎలిబబెత్ తరఫున ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పుష్పగుచ్ఛం సమర్పిస్తారని అధికారులు చెప్పారు.

ఎలిజబెత్​కు ఏటా ఆదివారం జరిగే సంస్మరణ కార్యక్రమం అత్యంత ముఖ్యమైనది. రెండో ప్రచంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ యుద్ధ సమయంలో ఎలిజబెత్ ఆర్మీ డ్రైవర్​గా సేవలందించారు. అయితే ఆమె హాజరుకాకపోయినా.. రాజవంశ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు స్పష్టం చేశారు.

గత నెలలో పరీక్షల నిమిత్తం ఒక్కరోజు లండన్​లోని ఆస్పత్రిలో ఉన్నారు ఎలిజబెత్. ఆమె రెండు వారాల పాటు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు బకింగ్​హామ్ ప్యాలెస్ అక్టోబర్​ 29న ప్రకటన విడదుల చేసింది. అందుకే గ్లాస్గోలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సుకు హాజరుకాలేదు. వీడియో సందేశమే ఇచ్చారు. విశ్రాంత సమయంలో ఎలిజబెత్​ ఇంటి నుంచే పనిచేస్తున్నారు.

ఎక్కువకాలం జీవించి, పాలించిన బ్రిటన్ రాణిగా ఘనత సాధించిన ఎలిజబెత్ 2.. వచ్చే ఏడాది ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకోనున్నారు. సింహాసనాన్ని అధిష్ఠించి 70ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద సంగీత కచేరి.. 8వేల మంది కలిసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.