ETV Bharat / international

ప్రపంచంలోనే అతిపెద్ద సంగీత కచేరి.. 8వేల మంది కలిసి..

author img

By

Published : Nov 14, 2021, 12:31 PM IST

Updated : Nov 14, 2021, 5:11 PM IST

వెనెజువెలాలో వేలాది మంది వాయిద్యకారులు చేసిన సంగీత ప్రదర్శన (Venezuela youth orchestra) చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. వందలాది పియానోలు, వయోలిన్లు, డ్రమ్స్‌, గిటార్లతో.. చేసిన కార్యక్రమం సంగీత ప్రియులను కట్టి పడేస్తోంది. 8వేల మందికి పైగా సంగీతకారులు చేసిన ఈ ప్రదర్శన 'గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్' (Guinness World record Orchestra) అధికారుల దృష్టిలో సైతం పడింది.

venezuela record ORCHESTRA
venezuela record ORCHESTRA

ప్రపంచంలోనే అతిపెద్ద సంగీత కచేరి.. 8వేల మంది కలిసి..

వెనెజువెలాలోని మిలటరీ అకాడమీలో యూత్‌ ఆర్కెస్ట్రా (Venezuela youth orchestra) నిర్వహించిన కచేరి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది. ఏకకాలంలో 8,097 మంది వాయిద్యకారులు చేసిన సంగీత కచేరీ.. 'గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్' (Worlds largest Orchestra) అధికారుల దృష్టిని ఆకర్షించింది. వేలాది మంది సంగీతకారులు, వందలాది పియానోలు, వయోలిన్లు, డ్రమ్స్‌ మోగిస్తూ చేసిన ప్రదర్శన సంగీత ప్రియులను కట్టి పడేసింది. ఈ ప్రదర్శనకు అధికారికంగా గుర్తింపునివ్వడంపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు గిన్నిస్‌ బుక్‌ (Orchestra Guinness record) అధికారులు తెలిపారు.

venezuela record ORCHESTRA
వేల సంఖ్యలో సంగీత కళాకారులు

చిన్నారులు, టీనేజ్‌ యువకులే!

ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు వెనెజువెలా నలుమూలల నుంచి సంగీతకారులు (Venezuela youth orchestra) తరలివచ్చారు. సంగీతంలో.. ప్రపంచ రికార్డు సాధించాలన్న ఉద్దేశంతో వెనెజువెలా (Biggest Orchestra in the world) దేశభక్తి గీతాన్ని 10 నిమిషాల పాటు ప్రదర్శించారు. కచేరిలో పాల్గొన్న వారిలో అత్యధికులు చిన్నారులు, టీనేజ్‌ యువకులే ఉన్నారు.

venezuela record ORCHESTRA
సంగీత విభావరి జరుగుతున్న ప్రాంతం.. డ్రోన్ దృశ్యం

12 వేలు అనుకుంటే..

అయితే ఈ రికార్డు స్థాయి సంగీత కచేరికి (Guinness World record Orchestra) మెుత్తం 12వేల మంది సంగీతకారులను సమీకరించాలని వెనెజువెలా మ్యూజిక్‌ నెట్‌వర్క్‌ ఈ సిస్టెమా భావించింది. కానీ అనుకున్న దాని కంటే తక్కువ మంది వాయిద్య కారులు సంగీత ప్రదర్శనకు హాజరయ్యారు.

venezuela record ORCHESTRA
వయోలిన్ వాయిస్తున్న యువతీయువకులు

2 నెలల నుంచి శిక్షణ

రికార్డు స్థాయి కచేరిని పరిశీలించేందుకు మొత్తం 250 మంది సూపర్‌వైజర్లు పనిచేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వీరు సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగీతకారులను లెక్కించేందుకు నెంబర్లు ఉన్న సీట్లను వారికి కేటాయించారు. మరోవైపు ఈ భారీ కచేరిని ఏకకాలంలో చేసేందుకు.... 2 నెలల ముందు నుంచే సంగీతకారులు శిక్షణ పొందినట్లు నిర్వహకులు తెలిపారు.

venezuela record ORCHESTRA
కేచరి అనంతరం బాణసంచా వెలుగులు

ఇదీ చదవండి: సంగీతంలో అద్భుతాలు- కళ్లకు గంతలతో కీబోర్డు తిరగేసి మరీ..

Last Updated : Nov 14, 2021, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.