ETV Bharat / international

ముక్కులో విస్కీ.. వైరస్​కు ఇదే సరైన చికిత్స!

author img

By

Published : Sep 20, 2021, 1:26 PM IST

విస్కీ తాగితే వైరస్​ నయమవుతుందా? ముక్కులో విస్కీ చుక్కలు పోసుకుంటే వైరస్​ నుంచి కోలుకుంటామా? సాంకేతికత అందుబాటులో లేని 1918 కాలంలో స్పానిష్​ఫ్లూ సోకింది. ఆ సమయంలో వైద్యులు, నర్సులు ఇలాంటి ప్రయోగాలు చేసేవారట. ప్రాణాంతక ఫ్లూ నుంచి ప్రజలను రక్షఇంచడం కోసం ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశారట.

spanish flu
ఫ్లూ

ఇప్పుడంటే అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉండటం వల్ల.. కొవిడ్​కు ఏడాదిలోపే వ్యాక్సిన్​ను తీసుకొచ్చేశారు. వైరస్​ మూలలపై పరిశోధనలు శరవేగంగా సాగుతున్నాయి. కానీ 1918లో స్పానిష్​ ఫ్లూ(spanish flu 1918) విజృంభించినప్పుడు పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండేవి. మొదటి ప్రపంచ యుద్ధంతో అప్పటికే అల్లాడుతున్న దేశాలపై ఫ్లూ భారం పడింది. ఆ కాలంలో సరైన సదుపాయాలేవీ ఉందేవి కావు. ఫ్లూ నుంచి బయటపడేందుకు వింత ప్రయోగాలు జరిగేవి. వీటిల్లో 'వీస్కీ' చికిత్స ఒకటి. రోగికి ముక్కు ద్వారా విస్కీ అందించేవారు. ఈ ప్రయోగాలు ఫలించాయని కూడా అంటున్నారు కొంతమంది.

అప్పట్లో అవగాహన తక్కువ

1918 కాలంలో వైరస్​ గురించి ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. అసలు ఫ్లూ ఎలా వస్తుందానే విషయం కూడా చాలా మందికి తెలియదు. అసలు విషయాన్ని వైద్యులు అర్థం చేసుకునేసరికి ఆలస్యమైపోయింది(spanish flu deaths). తొలుత బ్యాక్టీరియాపైనే అధ్యయనాలు అన్నీ జరిగేవి. ఫ్లూ మరణాల్లో ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా ఇన్​ఫెక్షన్లు కనిపించేవి. ఫలితంగా వైరస్​ను పట్టించుకోకుండా బ్యాక్టీరియాపైనే ఎక్కువ దృష్టి సారించేవారు.

ఈ క్రమంలో 'చికిత్స','నివారణ' పేరుతో రకరకాల ప్రయోగాలు జరిగేవి. ఎలాంటి నియంత్రణలు, నిబంధనలు లేకుండా టీకా ట్రయల్స్​ చేసేవారు.

డాక్టర్లు అలా.. నర్సులు ఇలా..

డాక్టర్లు వారి సొంతంగా మందులు అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. 1919 మార్చిలో ఆస్ట్రేలియా సిడ్నీ చీఫ్​ క్వారంటైన్​ ఆఫీసర్​ అయిన డా. రైడ్​.. ఫ్లూ చికిత్స కోసం కాల్షియం లాక్టేట్​ను ఉపయోగించారు. ప్రతి 4 గంటలకు ఓ సారి రోగులకు ఇచ్చేవారు. మరోవైపు ఫ్లూ, న్యుమోకోకస్​ బ్యాక్టీరియాతో కూడిన 'వ్యాక్సిన్​'ను కూడా ఇచ్చేవారు. 203 కేసుల్లో ఒక్క మరణం కూడా లేకపోవడం గమనార్హం.

ప్రస్తుత కాలంలో రక్తంలో కాల్షియం స్థాయిలు పడిపోతే.. ఈ కాల్షియం లాక్టేట్​ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత.. వీటి మోతాదుపై కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ కాలంలో చాలా ఎక్కువే ఇచ్చేవారు.

ఫార్మాసిస్ట్​లు కూడా 'ఫ్లూ నివారణకు ఇదే మందు' అంటూ కొన్ని మందులను అమ్మేవారు. న్యూ సౌత్​ వేల్స్​కు చెందిన జే. రీజినాల్డ్​ ఆల్బర్ట్​ అనే వ్యక్తి.. తన మందుకు పేటెంట్​ కూడా తెచ్చుకుని ప్రచారం చేశారు.

ఇదీ చూడండి:- COVID-19: గాలి ద్వారా వ్యాపించేలా కరోనా రూపాంతరం

ఆ కాలంలో ఆరోగ్య వ్యవస్థలో నర్సులకు ప్రాధాన్యత చాలా తక్కువగా ఉండేది. ఫ్లూ సమయంలో ప్రజలు వారి మాటలు కూడా వినేవారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్​కు చెందిన నాన్​ టైలర్​ అనే నర్సు.. ఫ్లూ చికిత్సలో కోసం 'విస్కీ'ని ప్రవేశపెట్టారు. రోగులకు ఎక్కువ మోతాదులో విస్కీని ఇవ్వడం మొదలుపెట్టారు. కొన్ని సందర్భాల్లో ముక్కు ద్వారా విస్కీ చుక్కులను పోసేవారు. ఇలా విస్కీతో పాటు క్వినైన్​, కాస్టర్​ ఆయిల్​​ను కూడా సిఫార్సు చేశారు.

1918లో దక్షిణాఫ్రికాలో విధులు నిర్వహించి సిడ్నీకి తిరిగొచ్చిన కేట్​ గుజ్జిని అనే నర్సుకు స్పానిష్​ ఫ్లూ సోకింది. 'ఆరు వారాల పాటు నాకు కేవలం బ్రాందీ, పాలు, క్వినైన్​, వేడివేడి నిమ్మకాయ జూసు మాత్రమే ఇచ్చారు. అది బాగానే పనిచేసింది,' అని చెప్పారు కేట్​.

ఫ్లూ సంక్షోభం వ్యాపార సంస్థలకు ఓ రకంగా మంచే చేసింది. అవకాశాన్ని అందిపుచ్చుకున్న బానాక్స్​ అనే బీఫ్​ పేస్ట్​ సంస్థ.. 'మా ఉత్పత్తులను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మనిషికి శక్తి వస్తుంది,' అంటూ ప్రచారాలు చేసింది.

ఇదీ చూడండి:- వ్యాక్సిన్లను సాగు చేసుకొని.. తినేయొచ్చు!

స్వీయ ప్రయోగాలు కూడా...

ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి డాక్టర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అవసరమైతే అందుబాటులో ఉండే స్థితిలో వైద్యులు లేరు. దీంతో చాలా మంది ప్రజలు ఇంట్లోనే చికిత్స, నివారణ చర్యలు తీసుకునేవారు. మంచి ఫలితాలు వస్తే.. స్థానిక వార్తాపత్రికల్లో వాటిని ప్రచురించేవారు. అయితే దీనిపై అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి.

స్పానిష్​ ఫ్లూ చికిత్స కోసం ఆస్పిరిన్​ విరివిగా ఉపయోగించేవారు. ప్రజలు వీటిని భారీ మోతాదులో తీసుకునేవారు. దీంతో ఫ్లూ తగ్గడం మాట పక్కనపెడితే.. మరణాలు భారీగా పెరిగిపోయాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సరైన చికిత్స అందుబాటులో లేకపోవడం కారణంగా.. క్వినైన్​, ఫెనాసెటిన్​తో పాటు ఆస్పిరిన్ వినియోగాన్ని ప్రభుత్వ అధికారులు కూడా ప్రోత్సహించేవారు. ఫెనాసెటిన్​పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉంది.

ఇప్పటికీ...

ఫ్లూ ప్రపంచాన్ని వీడినా.. ఆ కాలంలోని అలవాట్లు మాత్రం ఇంకా వదలలేదు. ఆస్పిరిన్​ను ఇప్పటికీ వినియోగిస్తున్నారు. కొవిడ్​ కాలంలో భయంతో ప్రజలు ఇళ్లల్లో వివిధ రకాల ప్రయోగాలు చేశారు. 'ఇది తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అది తింటే కొవిడ్​ నుంచి కోలుకుంటారు' అంటూ జోరుగా ప్రచారాలు కూడా సాగుతున్నాయి.

మరీ ముఖ్యంగా.. 'తగిన మోతాదులో అప్పుడప్పుడు విస్కీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది,' అన్న మాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది!

ఇదీ చూడండి:- 109ఏళ్లల్లో ఎన్నో మహమ్మారులను జయించిన 'బామ్మ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.