ETV Bharat / international

గుడ్ న్యూస్.. ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న కరోనా కేసులు

author img

By

Published : Oct 1, 2021, 11:53 AM IST

COVID-19 cases and deaths continue to decline globally
గుడ్ న్యూస్.. ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న కేసులు

కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా(corona cases globally) తగ్గుముఖం పడుతుండటం ఊరటనిస్తోంది. అంతకుముందు వారంతో పోల్చితే గతవారం కొత్త కేసులు, మరణాలు 10శాతం దిగొచ్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది(corona cases who data).

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు(corona cases globally) ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గతవారం కొవిడ్ గణాంకాలను విశ్లేషించి(corona cases who data) ఈ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్​ 20-26 వరకు 33 లక్షలకు పైగా కొత్త కేసులు.. 55,000 కొత్త మరణాలు నమోదైనట్లు తెలిపింది. అంతకుముందు వారంతో పోల్చితే ఇవి 10శాతం తక్కువ అని చెప్పింది. ఆగ్నేయాసిలో గత రెండు నెలలుగా కేసులు, మరణాలు క్రమక్రమంగా తగ్గినట్లు వివరించింది.

  • ఇతర ప్రాంతాలతో పోల్చితే తూర్పు మధ్యదరా ప్రాంతంలో కొత్త కేసులు గణనీయంగా 17శాతం వరకు తగ్గినట్లు డబ్ల్యూహెచ్​ఓ(corona cases worldwide) పేర్కొంది. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో 15 శాతం, అమెరికా ప్రాంతంలో 14, ఆఫ్రికా ప్రాంతంలో 12, ఆగ్నేయాసియాలో 10 శాతం కేసులు దిగొచ్చిన్నట్లు తెలిపింది. ఐరోపాలో మాత్రం పెద్దగా వ్యత్యాసం లేదంది.
  • ఐరోపా(corona cases europe), ఆప్రికా తప్ప ఇతర ప్రాంతాల్లో కరోనా మరణాలు 15 శాతం తగ్గాయి. అత్యధికంగా పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో 24శాతం వరకు కొత్త మరణాలు క్షీణించాయి.
  • ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 23.1కోట్లు దాటింది. మరణాలు 47లక్షలకు పైగా నమోదయ్యాయి.
  • ఆల్ఫా వేరియంట్ కేసులు 193 దేశాల్లో వెలుగుచూశాయి. డెల్టా వేరియంట్ 187 దేశాల్లో, బీటా వేరియంట్ 142 దేశాల్లో, 96 దేశాల్లో గామా వేరియంట్ కేసులు బయటపడ్డాయి.
  • అత్యధికంగా అమెరికాలో వారం రోజుల్లో 7.65లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంతో పోల్చితే ఇవి 31 శాతం తక్కువ. బ్రెజిల్​లో 2.47లక్షల కేసులు వెలుగుచూశాయి. బ్రిటన్​లో 2.30లక్షలు, భారత్​లో 2.04లక్షలు(గతవారం కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి), టర్కీలో 1.92లక్షల కేసులు నమోదయ్యాయి.
  • అమెరికాలో మరణాలు 17శాతం తగ్గి 14,842గా నమోదయ్యాయి. రష్యాలో స్థిరంగా 5,469 మరణాలు, బ్రెజిల్​లో 3,727 మరణాలు(10శాతం ఎక్కువగా) నమోదయ్యాయి.
  • తూర్పు ఆసియా ప్రాంతంలో గత రెండు నెలలుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గతవారం 3.44లక్షల కేసులు, 5,200 మరణాలు నమోదయ్యాయి. వీటిలో భారత్​లో అత్యధికంగా 2.04లక్షల కేసులు(corona cases in india) వెలుగుచూశాయి.

ఇదీ చదవండి: గర్భస్థ శిశువులపై కాలుష్య కాటు- నెలలు నిండకముందే జననం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.