ETV Bharat / international

కరోనా చికిత్సకు హెపటైటిస్​ సీ మందులు!

author img

By

Published : May 5, 2020, 2:40 PM IST

కరోనా​కు సరైన చికిత్స అందించడం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. వైరస్​ సోకిన వారికి నయం చేయడంలో హెపటైటిస్​ సీ మందులు ప్రభావవంతంగా ఉంటాయని తాజాగా జర్మనీ పరిశోధకులు చెబుతున్నారు. కంప్యూటర్​ సిమ్యులేషన్స్​ ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు.

Hepatitis C drugs may help fight COVID-19, supercomputer simulations suggest
కరోనా చికిత్సకు హెపటైటిస్​ సీ మందులు!

హెపటైటిస్​ సీ వ్యాధికి చికిత్సలో ఉపయోగించే మందులు.. కరోనా వైరస్​పైనా ప్రభావం చూపుతాయని తాజా పరిశోధనలో తేలింది. సూపర్​ కంప్యూటర్​ సిములేషన్స్ ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు పరిశోధకులు.

జర్మనీలోని జాహన్నెస్​ గుటెన్​బర్గ్​ విశ్వవిద్యాలయం(జేజీయూ) పరిశోధకులు.. డేటా బేస్​ ఆధారంగా సార్స్​-సీఓవీ2లోని ప్రోటీన్లతో దాదాపు 42వేల పదార్థాలు ఎలా బంధించి ఉంటాయనే దానిపై అధ్యయనం చేశారు. అనంతరం వైరస్​ మనిషి లోపలకు ప్రవేశించకుండా, వ్యాప్తిచెందకుండా అవి ఎలా అడ్డుకుంటాయో గుర్తించారు.

అత్యంత శక్తిమంతమైన మోగన్​ 2 సూపర్​ కంప్యూటర్​ను ఉపయోగించి రెండు నెలల్లో 30 బిలియన్​ క్యాలిక్యులేషన్స్​ చేశారు పరిశోధకులు. సిమిప్రేవిర్​, పరిట్రాప్రెవిర్​, గ్రాజోప్రెవిర్​, వెల్పటాస్​విర్​ అనే నాలుగు హెపటైటిస్​ సీ మందులు... సార్స్​-సీఓవీ2ను గట్టిగా పట్టుకుని.. వైరస్​ను నివారించగలుగుతాయని ఈ పరిశోధనల్లో తేలింది.

"ఈ కంప్యూటర్​ సిములేషన్​ పద్ధతి.. మాలిక్యులర్​ డాకింగ్​గా ఎన్నో ఏళ్లుగా ప్రసిద్ధి చెందింది. ల్యాబ్​లో ప్రయోగాల కన్నా ఇది ఎంతో వేగవంతంగా, తక్కువ ఖర్చుతో ఉంటుంది. సార్స్​-సీఓవీ2పై మాలిక్యులర్​ డాకింగ్​ చేసిన తొలి పరిశోధకులు మేమే. హెపటైటిస్​ సీ కోసం ఉపయోగించే మందులు వైరస్​ చికిత్స కోసం పనికొస్తాయని మేము గుర్తించాం."

--- థామస్ ఎఫ్ఫెర్త్​, జేజీయూ.

సార్స్​-సీఓవీ2, హెపటైటిస్​ సీ వైరస్​లు ఒకే రకమైనవని చెప్పడానికి ఈ పరిశోధన ఫలితాలు ఊతమిస్తున్నాయి. ఈ పరిశోధన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) బులిటెన్​లో ప్రచురితమైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.