ETV Bharat / international

టాయిలెట్​ పేపర్​ కేక్​... కరోనా కాలంలో కొత్త ట్రెండ్​

author img

By

Published : Mar 27, 2020, 6:10 PM IST

సాధారణంగా టాయిలెట్​ పేపర్లు బాత్​రూమ్​లకే పరిమితమై ఉంటాయి. అలాంటి వాటిని ఆరగించేస్తున్నారు జర్మనీ ప్రజలు. ఆశ్చర్యంగా ఉందా? కరోనా ధాటికి ఆహారం దొరకడం లేదని అందుకే ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారా? కాదు. ఈ టిష్యూలకు ఓ ప్రత్యేకత ఉంది.

Dortmund baker
టాయిలెట్​ పేపర్​ కేక్​... కరోనా కాలంలో కొత్త ట్రెండ్​

టాయిలెట్​ పేపర్లును లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు జర్మనీ వాసులు. టాయిలెట్​ పేపర్లు తినడం ఏంటి అనుకుంటున్నారా? ఇవి సాధారణ పేపర్లు కాదు. వాటి ఆకారంలో తయారు చేసిన కేకులు. అందుకే ప్రజలు వీటిపై మక్కువ చూపిస్తున్నారు.

టాయిలెట్​ పేపర్​ కేక్​... కరోనా కాలంలో కొత్త ట్రెండ్​

జర్మనీ డోర్ట్​మండ్​లో ఓ వ్యక్తి టాయిలెట్ పేపర్ల ఆకారంలో కేక్​లను తయారు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఓ కేకు చుట్టూ క్రీమ్​ పూసి, దానిపై టాయిలెట్ పేపర్ల ఆకారంలో కేకును తయారు చేశాడు 36 ఏళ్ల టిమ్ కోర్టుయమ్​. అయితే ఇదంతా కేవలం సరదా కోసమే చేశానని చెప్పాడు టిమ్. విభిన్న ఆకృతుల్లో ఇలా ఎనిమిది కేకులు చేసి సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పోస్ట్ చేశాడు. వాటిని చూసిన అందరూ ఆశ్చర్యానికి గురై ఆర్డర్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కేకులు అధికంగా అమ్ముడవుతున్నాయి.

" కేవలం సరదాకోసం టాయిలెట్​ పేపర్ల ఆకృతిలో కేకులను తయారు చేశాం. వీటిని ఆన్​లైన్​లో ఉంచగా అందరూ వీటికి ఆకర్షితులై ఆర్డర్ చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి వీటి సంఖ్యను పెంచాం. ప్రస్తుతం వీటిని చాలా మంది వినియోగదారులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం రోజుకు 200 తయారు చేస్తున్నాం."

-- టిమ్​ కోర్టుయమ్

ఇదీ చదవండి: కరోనా బాధితుల ప్రవాహంతో హోటళ్లే ఆస్పత్రులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.