ETV Bharat / international

'సెప్టెంబర్​ నుంచి బూస్టర్​ డోసు పంపిణీ'

author img

By

Published : Jul 1, 2021, 12:02 PM IST

Updated : Jul 1, 2021, 12:44 PM IST

booster dose in uk
యూకేలో వ్యాక్సిన్​ మూడో డోసు

ఈ ఏడాది సెప్టెంబర్​ నుంచి కొవిడ్​ టీకా బూస్టర్​ డోసు పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు బ్రిటన్​ ఆరోగ్య మంత్రి సాజిద్​ జావిద్​. టీకా మొదటి డోసు ఇంకా తీసుకోని వారు ఎవరైనా ఉన్నట్లయితే.. వెంటనే వ్యాక్సిన్​ తీసుకోవాలని కోరారు. మరోవైపు.. భారత్​లో కొవాగ్జిన్​ టీకా బూస్టర్​ డోసు వినియోగంపై క్లినికల్​ ట్రయల్స్​ ఫలితాలు నవంబర్​ నాటికి వచ్చే అవకాశాలున్నాయి.

కరోనా టీకా(Covid vaccine) బూస్టర్​ డోసు పంపిణీ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది బ్రిటన్​. ఈ ఏడాది సెప్టెంబర్​ నుంచి బూస్టర్​ డోసు పంపిణీని ప్రారంభిస్తామని బుధవారం ఆ దేశ ఆరోగ్య మంత్రి సాజిద్​ సావిద్​ తెలిపారు. టీకా పంపిణీ, రోగ నిరోధకతపై ఏర్పాటైన ఉమ్మడి కమిటీ(జేసీవీఐ) చేసిన సూచన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

"సెప్టెంబర్​ నుంచి బూస్టర్​ డోసు వేయాలని మాకు జేసీవీఐ సూచించింది. వ్యాధి ప్రభావానికి ఎక్కువ గురయ్యే అవకాశం ఉన్నవారికి తొలుత టీకా అందించాలని తెలిపింది. ఇదే మా ప్రణాళిక. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అంత్యంత కీలకమైనది. టీకా మొదటి డోసు ఇంకా తీసుకోని బ్రిటన్​ పౌరులు ఎవరైతే ఉన్నారో.. వారు ముందుకు వచ్చి టీకా తీసుకోవాలి."

- సాజిద్​ జావిద్​, బ్రిటన్​ ఆరోగ్య మంత్రి

ఇన్​ఫ్లూయెంజా సీజన్​ను ఎదుర్కోవటంలో భాగంగా.. కొవిడ్​ వ్యాక్సిన్​తో పాటు ఫ్లూ టీకా పంపిణీ కార్యక్రమం కూడా బ్రిటన్​లో కొనసాగతుందని సాజిద్​ సావిద్​ స్పష్టం చేశారు. చాలా దేశాలు కొవిడ్​ టీకా బూస్టర్​ డోసు పంపిణీ చేయాలని యోచిస్తున్నాయి. అయితే.. ఈ ప్రక్రియను మొదలుపెట్టే విషయంలో బ్రిటన్ అన్నింటికంటే ముందుగా ఉందని తెలుస్తోంది.

బ్రిటన్ ఆరోగ్య మంత్రిగా సాజిద్​ జావిద్​ శనివారమే బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఈ పదవిలో ఉన్న మ్యాట్​ హాంకాక్​​.. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తన కార్యాలయంలోని సహాయకురాలిని ముద్దు పెట్టుకునే ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఆయన తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

భారత్​లో నవంబర్​ నాటికి..

భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా మూడో డోసు వినియోగంపై క్లినికల్​ ట్రయల్స్​ ఫలితాలు నవంబర్​ నాటికి వస్తాయని అంచనా వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడో డోసుపై పరీక్షలు నిర్వహించేందుకు భారత్​ బయోటెక్​ సంస్థకు డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా(డీసీజీఐ) ఏప్రిల్​లో అనుమతులు ఇచ్చింది. భారత్​లో 12 చోట్ల ఈ బూస్టర్​ డోసు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: 'టీకా బూస్టర్​ డోస్​పై ముమ్మర పరిశోధనలు'

ఇదీ చూడండి: వ్యాక్సిన్ బూస్టర్‌ డోసులు అవసరమా?

Last Updated :Jul 1, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.