ETV Bharat / international

బైడెన్​కు చైనా స్ట్రాంగ్​ వార్నింగ్!

author img

By

Published : Jun 14, 2021, 7:08 PM IST

క్వాడ్ కూటమికి దూరంగా ఉండాలని చైనా నాయకుడు ఒకరు తనకు సూచించారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అధ్యక్ష పదవి చేపట్టక ముందు ఆ చైనా నాయకుడితో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు.

BIDEN CHINA QUAD
క్వాడ్​లో పాల్గొనొద్దని బైడెన్​కు చైనా హెచ్చరిక

అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్​తో కూడిన చతుర్భుజ కూటమి 'క్వాడ్​' విషయంలో చైనాకు చెందిన ఓ నేత అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​ను బెదిరించేందుకు యత్నించారు. ఈ విషయాన్ని బైడెన్ స్వయంగా వెల్లడించారు.

యూకే ఆతిథ్యమిస్తున్న జీ7 శిఖరాగ్ర సదస్సు ముగింపు సమావేశం సందర్భంగా లండన్​లో ప్రసంగించిన జో బైడెన్.. అధ్యక్ష పదవి చేపట్టక ముందు చైనా నాయకుడు ఒకరు తనతో మాట్లాడారని చెప్పారు. అంతర్జాతీయ సంబంధాల విషయంలో తన వైఖరేంటో తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నించారని తెలిపారు. క్వాడ్ బలోపేతానికి దూరంగా ఉండాలని సూచించినట్లు చెప్పారు. అయితే, ఆ వ్యక్తి ఎవరనే వివరాలు వెల్లడించలేదు బైడెన్.

"ఎన్నికైన తర్వాత ఏం చేస్తారని నన్ను అడిగినప్పుడు.. అమెరికా బలాబలాలను పునరుద్ధరిస్తామని చెప్పాను. మాపై నమ్మకం ఏర్పడేలా చేస్తా అని బదులిచ్చా. ఆ తర్వాత చైనా నేత.. క్వాడ్ విషయంలో కల్పించుకోకూడదని సూచించారు. 'మీరు క్వాడ్​తో కలిసి పనిచేయకూడదు' అని చెప్పారు."

-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

అయితే, బైడెన్.. అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. మార్చి 12న తొలిసారి దేశాధినేతల స్థాయిలో క్వాడ్ సమావేశం జరిగింది. వర్చువల్​గా జరిగిన ఈ సదస్సుకు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెనే ఆతిథ్యమిచ్చారు. ఇండో పసిఫిక్ అందరిదీ అని ఈ సందర్భంగా చైనాకు పరోక్ష హెచ్చరికలు పంపారు. భాగస్వామ్య దేశాలన్నింటితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.