ETV Bharat / international

'భారతీయులకు రెండో అతిపెద్ద ముప్పు అదే'

author img

By

Published : Mar 24, 2022, 7:14 AM IST

Air Pollution in India: వాయు కాలుష్యంతో మానవారోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ సంస్థ తెలిపింది. భారత్​కు రెండో అతి పెద్ద ముప్పు ఇదేనని వెల్లడించింది. 'ప్రపంచ గాలి నాణ్యత నివేదిక- 2022' పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పలు కీలక విషయాలు తెలిపింది.

Air Pollution in India
వాయు కాలుష్యం

Air Pollution in India: భారతీయుల ఆరోగ్యాన్ని వాయు కాలుష్యం ఎంతగా దెబ్బతీస్తోందో తాజా నివేదిక ఒకటి కళ్లకు కట్టింది! దేశంలో మానవారోగ్యానికి ఈ కాలుష్యమే రెండో అతిపెద్ద ముప్పుగా ఉందని స్పష్టం చేసింది. దాని దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థకు ఏటా దాదాపు రూ.11.47 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని వెల్లడించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్‌ సంస్థ 'ప్రపంచ గాలి నాణ్యత నివేదిక- 2022' పేరుతో మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వాతావరణంలో ప్రమాదకర పీఎం 2.5 దూళికణాల గాఢతను 2024 కల్లా 20-30% మేర తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2019లో ప్రవేశపెట్టిన ‘జాతీయ పరిశుభ్ర వాయు కార్యక్రమం (ఎన్‌సీఏపీ)’తో పెద్దగా ఒరిగిందేమీ లేదని ఈ నివేదిక పెదవి విరిచింది.

ఇదీ చదవండి: మాట మార్చేసిన తాలిబన్లు.. బాలికలకు స్కూళ్లలోకి నో ఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.