ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అమెరికా బ్రెజిల్, రష్యా, స్పెయిన్ సహా పలు దేశాల్లో కొవిడ్ బాధితులు పెరుగుతున్నారు. కొత్తగా 3లక్షల 19వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. దీంతో ప్రపంచంలో మొత్తం కేసుల సంఖ్య 10 కోట్ల 70 లక్షలు దాటింది. మొత్తం మృతుల సంఖ్య 23 లక్షల 36 వేలకు చేరింది.
మరోవైపు వైరస్ను జయించివారి సంఖ్య కూడా గణనీయంగానే పెరుగుతోంది. ఇప్పటివరకు 7 కోట్ల 88 లక్షల మందికిపైగా కొవిడ్ నుంచి కోలుకున్నారు. మరోవైపు ప్రపంచ దేశాల్లో టీకా పంపిణీ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది.
దేశం | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
అమెరికా | 2,77,00,629 | 476,405 |
బ్రెజిల్ | 95,50,301 | 2,32,248 |
రష్యా | 39,83,197 | 77,068 |
యూకే | 39,59,784 | 1,12,798 |
ఫ్రాన్స్ | 33,41,365 | 79,423 |
ఇదీ చూడండి: టీకాల సామర్థ్యంపై డబ్య్లూహెచ్ఓ అనుమానం!