ETV Bharat / international

కరోనా కాలంలోనూ ఆ దేశంలో పార్లమెంట్​ ఎన్నికలు

author img

By

Published : Aug 5, 2020, 12:23 PM IST

కరోనా వ్యాప్తి కారణంగా వాయిదాపడ్డ శ్రీలంక పార్లమెంట్​ ఎన్నికలు బుధవారం జరుగుతున్నాయి. వైరస్​ విజృంభణ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆ దేశ ఎన్నికల కమిషన్​ తెలిపింది.

Voting begins in Sri Lanka's parliamentary election
కరోనా కాలంలోనూ ఆ దేశంలో పార్లమెంట్​ ఎన్నికలు

కొవిడ్​ వ్యాప్తితో రెండుసార్లు వాయిదాపడ్డ శ్రీలంక పార్లమెంట్​ ఎన్నికలు బుధవారం జరుగుతున్నాయి. 225 పార్లమెంట్​ నియోజకవర్గాలకు గానూ.. 196 స్థానాల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగిలిన అభ్యర్థులను ఆయా పార్టీలు సాధించిన ఓట్ల నిష్పత్తి ఆధారంగా నామినేట్​ చేస్తారు.

సుమారు 1.60 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కరోనా వైరస్​ విస్తరిస్తున్న తరుణంలో.. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటుచేసినట్లు ఆ దేశ ఎన్నికల కమిషన్​ తెలిపింది.

ఓటింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం ముగియనుండగా.. గురువారం లెక్కింపు చేపడతారు. శుక్రవారం ఫలితాలు విడుదల కానున్నాయి.

మరో అవకాశం కోసం..

ఇప్పటికే ప్రధానిగా ఉన్న మహీంద రాజపక్స.. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారు. శ్రీలంక పీపుల్స్​ పార్టీ(ఎస్​ఎల్​పీపీ) భారీ మెజారిటీ సాధిస్తుందని మహీంద సోదరడు, ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజపక్స కుటుంబం నుంచి నలుగురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనా వేళ పార్లమెంటు ఎన్నికలు.. 'మహీంద'కే అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.