ETV Bharat / international

న్యూజిలాండ్​లో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం

author img

By

Published : Feb 5, 2020, 12:18 PM IST

Updated : Feb 29, 2020, 6:25 AM IST

భారీ వర్షాలు న్యూజిలాండ్​ను అతలాకుతలం చేస్తున్నాయి. పలు ప్రాంతాలు నీటమునిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయి జనజీవనం అస్తవ్యస్తమయింది. వరదల్లో చిక్కుకుపోయిన స్థానికులు, పర్యటకులను హెలికాఫ్టర్ల సాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది న్యూజిలాండ్ ప్రభుత్వం.

floods
న్యూజిలాండ్​లో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం

న్యూజిలాండ్​లో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం

న్యూజిలాండ్​లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పర్యటక ప్రదేశమైన దక్షిణ ద్వీపంలో 60 గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సుమారు 1000 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఫలితంగా... నదులు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాదిమంది స్థానికులు, పర్యటకులు నీటిలో చిక్కుకుపోయారు. హోటళ్లు, ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అంతరాయం..

భారీ వర్షం ప్రభావంతో.. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. రవాణా స్తంభించింది. విద్యుత్తు వ్యవస్థ నిలిచిపోయింది.

ఈ విపత్తు కారణంగా దక్షిణ ప్రాంతంలో ప్రభుత్వం అత్యయిక స్థాయిని ప్రకటించింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది.

ఇవీ చూడండి: దిల్లీ దంగల్​: సోషల్​ మీడియానే రణక్షేత్రం

దిల్లీ దంగల్​: పార్టీల 'పేరడీ పోరాటం'- ఓటర్లకు వినోదం

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/suspected-case-of-coronavirus-admitted-to-isolation-ward-of-haryana-based-hospital20200205083834/


Conclusion:
Last Updated : Feb 29, 2020, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.