ETV Bharat / international

ఎనిమిది మంది భార్యల ముద్దుల మొగుడు- ఒకే ఇంట్లో ఖుషీగా కాపురం!

author img

By

Published : Feb 1, 2022, 7:20 PM IST

Man with 8 wives: అతడో సామాన్యుడు. కానీ.. ఏకంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా అంతకుముందు చేసుకున్న భార్యలను ఒప్పించి మరీ వివాహమాడాడు. ఆ ఎనిమిది పెళ్లిళ్లు కూడా ప్రేమ తంతులే కావడం ఇక్కడ మరో ట్విస్ట్​. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న అతడు ఎవరు? వారి కాపురం ఎలా సాగుతుంది?

thai-man-lives-in-perfect-harmony-with-eight-young-wives
ఒకే ఇంట్లో 8మంది భార్యలతో కాపురం

Man with 8 wives: ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడొచ్చు గానీ.. ఒకే ఇంట్లో రెండు కొప్పులు ఇమడడం అసాధ్యం అన్నది తెలుగు సామెత. అందుకే.. ఇద్దరు భార్యలతో కాపురం చేస్తే సాహసమే అవుతుంది.

మరి ఒక్కో గదిలో ఇద్దరు భార్యల చొప్పున.. ఏకంగా ఎనిమిది మంది భార్యలతో ఎవరైనా 'అన్యోన్యం'గా ఉంటారా? ఎలాంటి గొడవలు లేకుండా.. కాపురం చేస్తారా? అసాధ్యమే అనిపిస్తుంది. కానీ.. థాయ్​లాండ్​కు చెందిన ఓంగ్ డామ్ సోరోట్ విషయంలో ఇదే జరుగుతోంది.

thai-man-lives-in-perfect-harmony-with-eight-young-wives
ఒకే ఇంట్లో 8మంది భార్యలతో కాపురం

సంప్రదాయ యంత్రాలతో పచ్చబొట్లు వేయడం ద్వారా థాయ్​లాండ్​లో ఫేమస్​ అయిన.. టాటూ ఆర్టిస్ట్​ ఓంగ్​ సోరోట్​ పేరు.. ఇప్పుడు ఆ దేశంలో మార్మోగిపోతోంది. ఓంగ్.. ఒకే ఇంట్లో ఎమినిది భార్యలతో కాపురం చేస్తున్నాడనే సంగతి తెలుసుకొని.. అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఓ థాయ్​ కమెడియన్​.. ఓంగ్​ సోరోట్​తో పాటు అతడి భార్యలను ఇంటర్వ్యూ చేశాడు. అందులో తన ప్రేమలు, పెళ్లిళ్లపై ఆకసక్తికర విషయాలను వెల్లడించాడు ఓంగ్​. దీనితో అతడి ఫాలోయింగ్​ ఒక సెలబ్రిటీ స్థాయిలో పెరిగిపోయింది.

అలాగే తమది ఎంతో అన్యోన్య దాంపత్యమని, గొడవలకు అసలు ఆస్కారం లేదని చెప్పుకొచ్చాడు ఓంగ్​. తన భార్యలు తనపట్ల ఎంతో ప్రేమను కనబరుస్తారని అంటున్నాడు. అతడి భార్యలు కూడా ఓంగ్​ను అదేస్థాయిలో మెచ్చుకున్నారు.

thai-man-lives-in-perfect-harmony-with-eight-young-wives
ఒకే ఇంట్లో 8మంది భార్యలతో కాపురం

ప్రేమలు.. పెళ్లిళ్లు ఇలా..

ఓంగ్..​ తన ఎనిమిది మంది భార్యలపై తొలిచూపులోనే మనసు పారేసుకున్నాడు. అతడికి పెళ్లి అయ్యిందని తెలిసి కూడా మిగతా ఏడుగురు పెళ్లికి ఒప్పుకోవడం విచిత్రం.

మొదటి భార్యను నాంగ్​ స్ప్రైట్​ను స్నేహితుడి పెళ్లిలో చూశాడు ఓంగ్​. వెంటనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెకు ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకున్నాడు.

రెండో భార్య నాంగ్​ నాన్​ను మార్కెట్​లో చూసి ఇష్టపడ్డాడు. మూడో భార్యను హాస్పిటల్​లో.. నాలుగు, ఐదో, ఆరో భార్యలను ఇన్​స్టా, ఫేస్​బుక్​, టిక్​టాక్​లో చూసి ప్రేమించాడు.

ఓంగ్.. తన తల్లితో కలిసి ఆలయానికి వెళ్లినప్పుడు ఏడో భార్య నాంగ్​ ఫిల్మ్​ను చూసి ఇష్టపడి పెళ్లిచేసుకున్నాడు.

ఒకరోజు నలుగురు భార్యలతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు.. తన ఎనిమిదో భార్యను చూసి అక్కడే పెళ్లిచేసుకొని.. ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఎనిమిది మంది భార్యల్లో ఇద్దరు గర్భంతో ఉన్నారు. మొదటి భార్యకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

గదికి ఇద్దరు భార్యల చొప్పున..

ఓంగ్​ ఇంట్లో నాలుగు పడక గదులు మాత్రమే ఉన్నాయి. ఇద్దరు భార్యలు ఒక్కో రూమ్​ చొప్పున.. నాలుగు గదుల్లో ఎమినిది మంది భార్యలు కాపురం చేయడం గమనార్హం. అయితే ఒకే గదిలో ఇద్దరు భార్యలు ఉన్నా.. వంతుల చొప్పన భర్తతో గడుపుతుండటం వల్ల ఇప్పటి వరకు వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదట.

మొదటి భార్య అనుమతితోనే రెండో పెళ్లి చేసుకున్నాడు ఓంగ్​.. అ తర్వాత పెళ్లిళ్లు కూడా అలాగే అనుమతి తీసుకొనే చేసుకున్నాడు. అందరినీ సమానంగా చూడటం వల్లే ఎలాంటి గొడవలు లేకుండా కాపురం సాఫీగా సాగుతోందని చెబుతున్నాడు ఓంగ్​.

పెళ్లైన వ్యక్తిని ఎందుకు వివాహం చేసుకున్నారని ప్రశ్నించగా.. ఓంగ్​ భార్యలు విచిత్రంగా సమాధానం చెప్పారు. ఓంగ్​ చాలా ఆకర్షణీయంగా ఉంటాడని, తమ పట్ల శ్రద్ధను కనబరుస్తాడని, అతడిని చూడగానే పిచ్చిపిచ్చిగా ప్రేమించినట్లు, అందుకే పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు.

ఓంగ్​ పెళ్లైన వ్యక్తి అని, అతడిని వివాహం చేసుకోవడం ఎందుకంటూ.. కుటుంబ సభ్యులు అడ్డుపడినా.. ఇబ్బందులు ఎదురైనా.. తాము మాత్రం వెనక్కి తగ్గలేదని చెప్పుకొచ్చారు. చివరికి తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు తెలిపారు.

అడ్డు చెప్పను

ధనవంతుడిని కాబట్టే తాను ఎనిమిది మంది భార్యలను చేసుకున్నానని చాలా మంది అనుకుంటున్నారని, అందులో వాస్తవం లేదని చెప్పుకొచ్చాడు ఓంగ్​. టాటూలు వేయడమే కాకుండా సోషల్​మీడియా సైట్స్​ కూడా నడుపుతున్నట్లు వెల్లడించాడు. తన భార్యలు కూడా పనులు చేస్తున్నారని వివరించాడు. ఆ ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నట్లు చెప్పాడు ఓంగ్​.

ఒకవేళ మీ నుంచి ఎవరైనా దూరం కావాలనుకుంటే? అని ప్రశ్నించగా.. అలా అనుకున్న వారికి తాను అడ్డు చెప్పనన్నాడు ఓంగ్​. వారి నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని చెప్పాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: బైడెన్ మనిషి రూపంలో ఉన్న తోలుబొమ్మ: మస్క్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.