ETV Bharat / international

'ఇప్పటికే ఆలస్యమైంది.. ఎలాగైనా యుద్ధాన్ని ఆపండి'

author img

By

Published : Feb 24, 2022, 1:16 PM IST

Updated : Feb 24, 2022, 2:36 PM IST

Russia Ukraine News: ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఎలాగైనా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించాలని కోరారు ఉక్రెయిన్ రాయబారి. ఇప్పటికే సమయం మించిపోయిందన్నారు.

ukrainian-envoy-appeals-to-un-members to stop-the-war
యుద్ధాన్ని ఆపండి.. ఐరాస సభ్య దేశాలకు ఉక్రెయిన్​ రాయాబారి విజ్ఞప్తి

Russia attack Ukraine: ప్రపంచదేశాలు తమకు రక్షణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ. తమ గగనతలాన్ని రష్యా నుంచి రక్షించుకునేందుకు సాయం చేయాలని కోరారు. పుతిన్ ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో జెలెన్​స్కీ ఈమేరకు ప్రపంచ దేశాలను కోరారు. ఇది ఇక్రెయిన్​పై మాత్రమే కాదని ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని పేర్కొన్నారు.

అంతకుముందు యుద్ధాన్ని ఆపేందుకు ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు శాయశక్తులా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఉక్రెయిన్ రాయబారి సెర్గియ్ కిలిస్యా. ఇప్పటికే ఆలస్యమైందని, అన్ని దేశాలు తమకు సహకరించాలన్నారు. ఐరాస భద్రతా మండలి నిర్వహించిన అత్యవసరం సమావేశంలో ఈ మేరకు కోరారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్​ తమపై దండయాత్ర మొదలుపెట్టాడని, చాలా నగరాలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి మిట్రో కులేబా ఆవేదన వ్యక్తం చేశారు.

'పుతిన్ ఉక్రెయిన్​పై పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించారు. ప్రశాంతంగా ఉన్న దేశంలోని నగారాల్లో అలజడులు మొదలయ్యాయి. దాడులు జరుగుతున్నాయి. ఇది దురాక్రమణ యుద్ధం. ఉక్రెయిన్​ తనను తాను కాపాడుకోగలదు. విజయం సాధించగలదు' అని కులేబ ట్వీట్ చేశారు.

Russia ukraine conflict

తూర్పు ఉక్రెయిన్​లో డొన్​బాస్​ను రక్షించేందుకు మిలిటరీ ఆపరేషన్​ నిర్వహిస్తున్నట్లు పుతిన్ ప్రకటించిన అనంతరం కులేబ ఈ ట్వీట్ చేశారు.

అయితే రష్యా చర్యను ఐరాస భద్రతామండలి సమావేశంలో ఆ దేశ విదేశాంగ​ మంత్రి వాసిలీ అలెక్​సీవిచ్ నెబెన్​జ్యా సమర్థించారు. ఉక్రెయిన్ చర్యలే ప్రస్తుత సంక్షోభానికి కారణమని ఆరోపించారు. చాలా ఏళ్లుగా ఆ దేశం తన బాధ్యతలను విస్మరించిందని, అందుకే తూర్పు ఉక్రెయిన్​ను కాపాడే బాధ్యతను తాము తీసుకున్నాని పేర్కొన్నారు.

ఉక్రెయిన్​పై రష్యా యుద్ధాన్ని ప్రకటించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా చాలా దేశాల అధినేతలు ఖండించారు. దీనివల్ల తీరని నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్​కు తాము సాయం అందిస్తామని చెప్పారు. యుద్ధం వల్ల జరిగే విధ్వంసానికి, ప్రాణనష్టానికి రష్యాదే పూర్తి బాధ్యత అని బైడెన్ అన్నారు.

ఇవీ చదవండి

Last Updated :Feb 24, 2022, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.