ETV Bharat / international

పాకిస్థాన్​ను గ్రే లిస్టులోనే కొనసాగిస్తూ ఎఫ్​ఏటీఎఫ్ నిర్ణయం

author img

By

Published : Jun 25, 2020, 3:55 AM IST

ఉగ్రసంస్థలకు ఆర్థికసాయం అందకుండా కట్టడి చేయడంలో విఫలమైన పాకిస్థాన్​ను గ్రే లిస్టులోనే ఉంచాలని ఎఫ్​ఏటీఎఫ్ నిర్ణయించింది. అక్టోబర్​లోపు ఉగ్రవాద నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోకపోతే బ్లాక్​ లిస్టులో చేర్చుతామని హెచ్చరించింది. పాకిస్థాన్​ గ్రే లిస్టులో కొనసాగితే.. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, యూరోపియన్ యూనియన్ నుంచి ఆర్థిక సాయం పొందడం కష్టమవుతుంది.

Pak to continue in FATF's 'Grey List'  for failing to check funding to LeT, JeM
పాకిస్థాన్​ను గ్రే లిస్టులోనే కొనసాగిస్తూ ఎఫ్​ఏటీఎఫ్ నిర్ణయం

జైషే మహమ్మద్​, లష్కరే తోయిబా లాంటి ఉగ్రసంస్థలకు ఆర్థికసాయం అందకుండా కట్టడి చేయడంలో విఫలమైన పాకిస్థాన్​ను గ్రే లిస్టులోనే కొనసాగించాలని ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ 'ఎఫ్​ఏటీఎఫ్'​ నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం కారణంగా వర్చువల్​గా జరిగిన మూడో ప్లీనరీ సమావేశంలో.. ఎఫ్​ఏటీఎఫ్​ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

బ్లాక్​ లిస్టులోకి..

"అక్టోబర్​లో జరిగే తదుపరి సమావేశం వరకు పాకిస్థాన్​ను గ్రే లిస్టులోనే కొనసాగించాలని ఎఫ్​ఏటీఎఫ్​ నిర్ణయించింది. అప్పటికల్లా ఎఫ్​ఏటీఎఫ్ సూచనలు పాటించడంలో విఫలమైతే... పాక్​ను బ్లాక్​లిస్ట్​లో చేర్చే అవకాశం ఉంది."

- ఓ ఎఫ్​ఏటీఎఫ్​ అధికారి

ఉగ్రవాదులకు నిధులు

లష్కరే తోయిబా, జైషే మహమ్మద్​,హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్​ మద్దతు ఇస్తోంది. అందువల్ల ఆయా ఉగ్ర సంస్థల నిర్మూలనకు పాక్​ చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలని ఎఫ్ఏటీఎఫ్​ను భారత్​ కోరింది. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ సురక్షిత స్థావరంగా మారిందని అమెరికాకు చెందిన కంట్రీ రిపోర్ట్స్ నివేదిక వెలువరించిన తరువాత... ఎఫ్​ఏటీఎఫ్​ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆర్థిక సాయం కష్టం

పాకిస్థాన్​ గ్రే లిస్టులో కొనసాగితే.. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, యూరోపియన్ యూనియన్ నుంచి ఆర్థిక సాయం పొందడం కష్టమవుతుంది.

ఇదీ చూడండి: కరోనా కాలంలో పార్లమెంట్​ సమావేశం ఇలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.