ETV Bharat / international

మళ్లీ క్షిపణి పరీక్ష- కరోనా వచ్చినా కిమ్​ తీరు మారదా?

author img

By

Published : Mar 29, 2020, 10:28 AM IST

ఓవైపు ప్రపంచం కరోనా సంక్షోభంతో తల్లడిల్లిపోతుంటే.. ఉత్తరకొరియా మాత్రం క్షిపణుల ప్రయోగాలను వదలడం లేదు. కరోనాపై పోరుకు ప్రపంచ దేశాలు ఐకమత్యంతో ముందడుగు వేస్తుంటే.. కిమ్​ ప్రభుత్వం మాత్రం మరోమారు బాలిస్టిక్​ మిసైళ్ల ప్రయోగం చేపట్టింది.

North Korea fires missiles into sea, criticized by South
కరోనా ఉన్నా.. కిమ్​ తీరు మారదా!

ప్రపంచంలో ఏం జరుగుతున్నా.. తమ రూటే సపరేటు అని మరోమారు రుజువుచేసింది ఉత్తరకొరియా. ఓవైపు ప్రపంచ దేశాలు కరోనా వైరస్​పై పోరుకు ఐకమత్యమే అస్త్రంగా ఒక్కటవుతుంటే... ఉత్తరకొరియా మాత్రం ఎప్పటిలాగే క్షిపణుల ప్రయోగంతో వార్తల్లో నిలుస్తోంది.

కిమ్​ ప్రభుత్వం తాజాగా బాలిస్టిక్​ మిసైళ్లను ప్రయోగించినట్టు దక్షిణ కొరియా ఆరోపించింది. ఉత్తర కొరియాలోని తూర్పు తీర ప్రాంతమైన వోన్​సాన్​ నుంచి ప్రయోగించిన ఈ క్షిపణులు.. కొరియన్​ ద్వీపకల్పం- జపాన్​ మధ్యలో ఉన్న సముద్రంలో పడినట్టు తెలిపింది. ప్రపంచం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలోనూ కిమ్​ ఇలాంటి చర్యలు చేపట్టడం తగదని హితవు పలికింది. తక్షణమే కిమ్​ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేసింది దక్షిణ కొరియా.

సౌదీలో...

సౌదీ రాజధాని రియాద్​లో మూడు పేలుళ్లు సంభవించాయి. ఇది జరిగిన కొద్దిసేపటికే.. రియాద్​ మీదుగా వస్తున్న ఓ క్షిపణిని సౌదీ నేతృత్వంలోని సైన్యం గుర్తించింది. అనంతరం దానిని ధ్వంసం చేసింది. ఈ దాడికి పాల్పడినవారి వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే యెమెన్​కు చెందిన హుతీ తిరుగుబాటుదారులే​ ఈ తరహా దాడులతో ప్రజలను నిత్యం భయపెడుతుంటారు.

ఇదీ చూడండి:- కరోనా కేసుల్లో అమెరికా కొత్త రికార్డ్- చైనాలో ఆగని మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.