ETV Bharat / international

ఉత్తర కొరియా 'కీలక' క్షిపణి పరీక్ష

author img

By

Published : Dec 14, 2019, 6:36 PM IST

Updated : Dec 14, 2019, 7:22 PM IST

ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు కొనసాగిస్తోంది. మరో కీలక క్షిపణి పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది.

North Korea conducts another 'crucial test' at Sohae launch site says KCNA
ఉత్తర కొరియా 'కీలక' క్షిపణి పరీక్ష

అంతర్జాతీయ ఆంక్షలు బేఖాతరు చేస్తూ మరో కీలక క్షిపణి పరీక్ష నిర్వహించింది ఉత్తర కొరియా. అణునిరాయుధీకరణ చర్చలను అమెరికా తిరిగి ప్రారంభించేందుకు కిమ్​ సర్కారు విధించించిన తుది గడువు దగ్గర పడుతున్న వేళ ఈ ప్రకటన చేసింది ఆ దేశ అధికారిక మీడియా.

డిసెంబర్​ 13న సోహే ప్రయోగ కేంద్రం నుంచి ఈ కీలక పరీక్ష చేపట్టినట్లు తెలిపింది ఉత్తర కొరియా. ఈ విజయంతో అణు దాడుల్ని ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరిగిందని ప్రకటనలో పేర్కొంది. అయితే ఆ ప్రయోగానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు.

గురువారం పసిఫిక్ మహాసముద్రంలో మధ్యశ్రేణి క్షిపణిని పరీక్షించింది అమెరికా. ఉత్తర కొరియా వ్యవహారంపై చర్చించేందుకు రేపు అమెరికా ప్రత్యేక ప్రతినిధి దక్షిణ కొరియా రాజధాని సియోల్ రానున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కిమ్ సర్కారు ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. పరీక్ష కోసం సోహే ప్రయోగ కేంద్రాన్ని ఎంచుకోవడమూ చర్చనీయాంశమైంది. ఆ

కేంద్రాన్ని మూసివేస్తామని గతేడాది దక్షిణ కొరియా అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో హామీ ఇచ్చింది ఉత్తర కొరియా.

త్వరలో మరొకటి!

అంతర్జాతీయ ఒత్తిళ్లతో దిగొచ్చిన ఉత్తర కొరియా... అమెరికాతో సంధి కోసం ప్రయత్నించింది. 2018 జూన్​ తర్వాత అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో మూడు సార్లు సమావేశమయ్యారు కిమ్ జోంగ్ ఉన్. అయితే ఫిబ్రవరిలో జరిగిన సమావేశం తర్వాత అణునిరాయుధీకరణ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.

చర్చలు పునఃప్రారంభించేలా అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది ఉత్తర కొరియా. ఈ ఏడాది చివర్లోగా చర్చలకు రాకపోతే 'క్రిస్మస్​ కానుక' ఇస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇందుకు అనుగుణంగా మరికొద్ది రోజుల్లో ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి:'హిరోషిమా'కు 17 రెట్లు శక్తితో కొరియా అణుబాంబు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Australia, New Zealand and the Pacific Islands. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Jubilee Oval, Sydney, Australia. 14th December, 2019
1. 00:00 Teams walk out
2. 00:08 Sydney FC head coach Steve Corica
First Half:
3. 00:13 GOAL: Sydney FC. Kosta Barbarouses scores in the 5th minute, assisted by Rhyan Grant. (Sydney FC 1 Central Coast Mariners 0)
4. 00:27 Replay
Second Half:
5. 00:47 CHANCE Sydney FC: Milos Ninkovic shot flies over the crossbar in the 59th minute
6. 00:57 CHANCE Mariners: Giancarlo Gallifuoco's header in the 89th minute is saved, assisted by Ziggy Gordon
7. 01:10 Replay
8. 01:21 CHANCE Mariners: Mark Birighitti's header after 90+5 minutes is saved
SOURCE:  IMG Media
DURATION:  01:39
STORYLINE:
A solitary goal by Kosta Barbarrouses after only five minutes proved to be the difference for A League leaders Sydney FC on Saturday as 'The Sky Blues' beat bottom club Central Coast Mariners 1-0 at the Jubilee Oval.
Sydney opened up an 8-point lead at the top of the standings with their sixth straight victory, but Steve Corica's side could easily have dropped points late in the game as the visitors pressed for an equaliser.
Last Updated :Dec 14, 2019, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.