ETV Bharat / international

తీవ్రస్థాయిలో కరోనా విజృంభణ- ఉద్యోగులకు పెయిడ్ హాలిడే

author img

By

Published : Oct 28, 2021, 5:48 PM IST

రష్యాలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. కొవిడ్‌ వెలుగుచూసినప్పటి నుంచి రికార్డుస్థాయిలో 40 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రోజూవారీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం వల్ల ఆంక్షలు కఠినతరం చేశారు. కరోనా నియంత్రణకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వారంపాటు దేశవ్యాప్తంగా ఉద్యోగులకు పెయిడ్‌ హాలిడేను ప్రకటించారు. ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోకపోవడం వల్లే వైరస్‌ విజృంభిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

russia
రష్యా

రష్యాలో కొవిడ్‌(Russia covid cases) విశ్వరూపం చూపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి కరోనా కేసులు(Corona virus in Russia) వెలుగుచూస్తున్నాయి. 24 గంటల్లో కొత్తగా 40 వేల 96 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 వందల 59 మరణాలు(russia corona deaths today) సంభవించాయి. వైరస్‌ వెలుగు చూసినప్పటి నుంచి రష్యాలో ఇవే అత్యధికమని ఆదేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా రష్యాలో ఇప్పటివరకు 2 లక్షల 35 వేల 57 మంది బలయ్యారు.

కరోనా తీవ్రతను నియంత్రించేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 7 వరకు వారం పాటు దేశవ్యాప్తంగా ఉద్యోగులకు పెయిడ్‌ హాలిడేను(corona lockdown in russia) ప్రకటించారు. రాజధాని మాస్కోలో మాత్రం ఉద్యోగులకు శుక్రవారం నుంచే పెయిడ్‌ హాలిడే ప్రారంభమైంది.

వాటికి మాత్రమే అనుమతి..

వైరస్‌ కట్టడికి మాస్కో నగరంలో పాఠశాలలు సహా రిటైల్ అవుట్‌లెట్‌లు, రెస్టారెంట్‌లు, క్రీడా, వినోదానికి సంబంధించిన వాటన్నింటినీ మూసివేశారు. కేవలం ఆహారం, మందులు, నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రమే తెరిచేందుకు అనుమతించారు. మ్యూజియంలు, థియేటర్లకు పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్‌ వేసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. క్లబ్‌లు ఇతర వినోద సంబంధిత ప్రదేశాలు మూసి ఉంచాలని, వ్యాక్సిన్‌ వేసుకోని వారు ఇళ్లకే పరిమితమయ్యేలా చూడాలని అధ్యక్షుడు పుతిన్‌(vladimir putin latest news)​ అధికారులను ఆదేశించారు.

మరోవైపు.. పెయిడ్‌ హాలిడే ఇవ్వడం ద్వారా వైరస్‌ను కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావించగా చాలామంది రష్యన్లు విహార యాత్రలకు వెళ్లేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ రష్యాలోని అన్ని వినోదాత్మక ప్రాంతాలను మూసివేయించారు. ఇదే సమయంలో ఈజిప్ట్‌, టర్కీకు వెళ్లేవారి సంఖ్య పెరిగినట్లు అధికారులు గుర్తించారు.

వ్యాక్సినేషన్​లో వెనుకంజ..

ప్రపంచంలో తొలి వ్యాక్సిన్‌ను(russia covid vaccine) తయారు చేసినట్లు ప్రకటించిన రష్యా.. పంపిణీలో(russia covid vaccination rate) మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే వెనుకంజలో ఉంది. దీనితో వ్యాక్సినేషన్ మందగించడం వల్లే కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయని అధికారులు ఆరోపిస్తున్నారు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు మందికి మాత్రమే అంటే.. 14.6కోట్ల మందిలో 4.9కోట్ల రష్యన్లకు మాత్రమే టీకాల పంపిణీ జరిగింది.

సుదీర్ఘ ఆంక్షలు సడలింపు!

మరోవైపు.. దాదాపు 19 నెలల అనంతరం దేశ సరిహద్దులను తెరిచేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లే పౌరులు కఠిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. తమ పౌరులు 177 దేశాలకు వెళ్లేందుకు విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగం అనుమతించింది. టీకా రెండు డోసులు తీసుకున్న వారిని అర్హులుగా ప్రకటించింది.

ప్రపంచంలో ఏ దేశం పాటించనటువంటి అత్యంత కఠినమైన లాక్​డౌన్​ను ఆస్ట్రేలియా అమలుచేసింది. దేశ పౌరులతో పాటు.. అనేకమంది విదేశీయులు గతేడాది మార్చి నుంచి అక్కడే చిక్కుకుపోయారు. ఈ ఆంక్షల నుంచి మినహాయింపు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ వారి అవి అంతగా ఫలించలేదు.

న్యూజిలాండ్​లోనూ..

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లాక్​డౌన్​ను(new zealand covid lockdown) అమలు చేసిన దేశాల్లో ఒకటిగా ఉన్న న్యూజిలాండ్ క్వారంటైన్ నిబంధనలను(new zealand quarantine rules) సడలించింది. విదేశాల్లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు ఈ సడలింపులు వీలు కల్పించనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. న్యూజిలాండ్‌కు(new zealand covid cases) వచ్చే ప్రయాణికులు సైన్యం నిర్వహించే క్వారంటైన్​లో ఏడు రోజులు ఉండాలి.

ఆంక్షలు సడలించినప్పటికీ.. పర్యటకులను ఇప్పట్లో అనుమతించేది లేదని స్పష్టం చేసింది న్యూజిలాండ్ ప్రభుత్వం. ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన న్యూజిలాండ్ వాసుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి వల్లే కొవిడ్ నిబంధనలను సడలించినట్లు తెలుస్తోంది.

మహమ్మారి ప్రారంభానికి ముందు ఏడాదికి 30లక్షలకుపైగా పర్యటకులు న్యూజిలాండ్‌ను సందర్శించేవారు.

సింగపూర్​లో కరోనా ఉగ్రరూపం..

సింగపూర్‌లో కరోనా(singapore coronavirus) ఉప్పెనలా విరుచుకుపడుతోంది. అక్కడ తాజాగా 5,324 కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనితో ఇప్పటివరకు అక్కడ నమోదైన కేసుల సంఖ్య 1,84,419కి చేరింది. మహమ్మారి ధాటికి మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో దేశంలో కరోనా మృతుల సంఖ్య(singapore corona death rate) 349కి చేరింది.

అసాధారణంగా కరోనా కేసులు పెరుగుతుండటాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.