ETV Bharat / international

ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం

author img

By

Published : Dec 17, 2021, 10:56 AM IST

Updated : Dec 17, 2021, 12:44 PM IST

Highest Civilian Award of Bhutan: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది భూటాన్​. కరోనా విపత్తు వేళ మోదీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నట్లు పేర్కొంది.

modi bhutan
మోదీ

Highest Civilian Award of Bhutan: ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది భూటాన్​. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది. 'ఆర్డర్​ ఆఫ్​ డ్రక్​ గ్యాల్పో' ('నాడగ్​ పెల్​ గి ఖోర్లో'- స్థానిక భాషలో) పేర్కొనే ఈ అవార్డును భూటాన్​ రాజు జిగ్మే ఖేసర్​ నగ్మే వాంగ్​చుక్​.. మోదీకి బహుకరించాలని సూచించినట్లు తెలిపింది.

కరోనా విపత్తు వేళ మోదీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ 'ఆర్డర్​ ఆఫ్​ డ్రక్​ గ్యాల్పో' అవార్డును అందిస్తున్నట్లు పేర్కొంది భూటాన్​ ప్రధాని మంత్రి కార్యాలయం.

"భూటాన్​ ప్రజల తరఫున మోదీకి శుభాకాంక్షలు. ఈ అవార్డు అందుకోవడానికి ఆయన అర్హులు. ఆధ్యాత్మిక భావాలు ఉన్న గొప్ప వ్యక్తి మోదీ. ఈ అవార్డు బహుకరణ నేపథ్యంలో మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం."

-భూటాన్​ పీఎంఓ

భూటాన్​ నేషనల్​ డే సందర్భంగా మోదీకి ఈ అవార్డు బహుకరించనుండటం విశేషం.

ఇదీ చూడండి : ప్రపంచంలో అత్యంత ఆరాధించే వ్యక్తుల్లో మోదీకి 8వ స్థానం

Last Updated : Dec 17, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.