ETV Bharat / international

ప్లీజ్.. అతడ్ని ఉరితీయొద్దు: ప్రభుత్వానికి 40వేల మంది విజ్ఞప్తి

author img

By

Published : Nov 5, 2021, 4:02 PM IST

Updated : Nov 10, 2021, 8:25 AM IST

భారత సంతతి వ్యక్తికి విధించిన ఉరిశిక్షను నిలిపేయాలంటూ ఆన్‌లైన్​లో పెద్ద ఉద్యమం నడుస్తోంది. అతనికి క్షమాభిక్ష ప్రకటించాలని ఏకంగా 40వేల మంది అభ్యర్థించారు. సింగపూర్‌లోని చాంగి జైలులో మరణశిక్ష ఎదుర్కోబోతున్న నాగేంద్రన్ కె.ధర్మలింగం ప్రాణాలు కాపాడేందుకు మానవ హక్కుల కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు.

Malaysian Indian
నాగేంద్రన్ కె.ధర్మలింగం

సింగపూర్​లో మరణశిక్షను ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆన్​లైన్​ వేదికగా ఉద్యమం నడుస్తోంది. మానసికంగా దివ్యాంగుడైన వ్యక్తికి ఉరిశిక్ష విధించొద్దంటూ విన్నవిస్తున్నారు మానవ హక్కుల కార్యకర్తలు. 2010లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో దోషిగా తేలిన మలేసియాకు చెందిన భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ కె ధర్మలింగం కోసమే ఇదంతా చేస్తున్నారు.

Malaysian Indian
నాగేంద్రన్ కె.ధర్మలింగం

'దారులు మూసుకుపోయ్..'

అయితే ధర్మలింగం ఆరోగ్య పరిస్థితి సరిగానే ఉందని.. చేసిన అప్పులు తీర్చేందుకు పూర్తి అవగాహనతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడని హైకోర్టుతో పాటు అప్పీల్ కోర్టు సమర్థించినట్లు సింగపూర్ హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అతనితో బలవంతంగా ఈ పని చేయించారనే వాదనలను తోసిపుచ్చింది. ఈ మేరకు 'టుడే వార్తాపత్రిక' ఓ కథనాన్ని ప్రచురించింది. నాగేంద్రన్ కుటుంబం మలేసియా నుంచి సింగపూర్‌కు వచ్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన హోమంత్రిత్వ శాఖ.. క్షమాభిక్ష కోసం అధ్యక్షునికి పెట్టుకున్న అర్జీ తిరస్కరణకు గురైందని స్పష్టం చేసింది.

Malaysian Indian
నాగేంద్రన్ కె.ధర్మలింగం కుటుంబం

మహోద్యమం..

నవంబరు 10న నాగేంద్రన్‌ను ఉరి తీయనున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలతో ఆందోళన చెందిన మానవ హక్కుల కార్యకర్తలు క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హైపర్ యాక్టివిటీ డిజార్డర్​తో బాధపడుతున్న నాగేంద్రన్‌కు.. క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ సింగపూర్ అధ్యక్షుడు హలీమా యాకోబ్‌కు అభ్యర్థనలు పంపుతున్నారు. అక్టోబర్ 29న ఆన్​లైన్ వేదికగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి.. 50వేల సంతకాల సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 39,962 సంతకాలను సేకరించారు.

Malaysian Indian
ఉరిశిక్ష రద్దు కోసం ఉద్యమం

తన ప్రియురాలిని చంపేస్తామని బెదిరించిన కొందరు.. నాగేంద్రన్​తో బలవంతంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేయించారని.. అందువల్ల దోషికి క్షమాభిక్ష ప్రసాదించాలని పిటిషన్‌లో అభ్యర్థిస్తున్నారు.

2009లో సింగపూర్​లోకి 42.72 గ్రాముల హెరాయిన్‌ను అక్రమ రవాణా చేస్తున్నాడనే అభియోగంపై నాగేంద్రన్‌కు 2010లో మరణశిక్ష విధించింది కోర్టు.

తాత్కాలికంగా నిలిపివేత..

మరణశిక్ష ఎదుర్కొంటున్న నాగేంద్రన్‌ ధర్మలింగానికి కరోనా రూపంలో అదృష్టం కలిసొచ్చింది. నాగేంద్రన్‌కు కొవిడ్‌-19 నిర్ధరణ అయినట్లు జైలు అధికారులు తెలపటం వల్ల బుధవారం అమలు చేయాల్సిన ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ చూడండి: భారత సంతతి వ్యక్తిని 'ఉరి' నుంచి కాపాడిన కరోనా!

ఇవీ చదవండి:

Last Updated : Nov 10, 2021, 8:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.