ETV Bharat / international

'చైనా భూభాగం దురాక్రమణకు భారత్ కుట్ర.. అందుకే ఉద్రిక్తత!'

author img

By

Published : Sep 30, 2021, 7:50 PM IST

india china border dipute
భారత్​ చైనా సరిహద్దు వివాదం

వాస్తవాధీన రేఖను దాటి వచ్చి భారత్​ తమ భూభాగాన్ని ఆక్రమిస్తోందని చైనా ఆరోపించింది. ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలకు(India China Border Dispute) భారత్ చర్యలే కారణమని వ్యాఖ్యానించింది. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను నియంత్రణలోకి తెచ్చుకునేందుకు.. ఆయుధాల వినియోగానికి తాము వ్యతిరేకం అని చెప్పింది. మరోవైపు.. భారత్-చైనా మధ్య సరిహద్దు ఒప్పందం కుదిరేవరకు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటాయని భారత ఆర్మీ చీఫ్​ జనరల్ ఎంఎం నరవణె పేర్కొన్నారు.

భారత్​తో సరిహద్దు వివాదానికి(India China Border Dispute) సంబంధించి చైనా తీవ్ర ఆరోపణలు చేసింది. వాస్తవాధీన రేఖను(Line Of Actual Control) దాటి తమ భూభాగాన్ని భారత్​ ఆక్రమిస్తోందని ఆరోపించింది. అదే.. ఇరు దేశాల మధ్య తలెత్తిన సరిహద్దు ఉద్రిక్తతలకు(India China Border Dispute) ప్రధానం కారణం అని వ్యాఖ్యానించింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ అత్యంత అధునాతన ఆయుధాలను భారత్​ మోహరిస్తోందని విలేకరులు అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"భారత్​ చాలాకాలంగా 'ఫార్వర్డ్​ పాలసీ'ని అనుసరిస్తోంది. చైనా-భారత్ సరిహద్దు ఉద్రిక్తతలకు ప్రధాన కారణం.. వాస్తవాధీన రేఖను ఆ దేశం అక్రమంగా దాటి రావడమే. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఆయుధాలు వినియోగించడానికి చైనా వ్యతిరేకం. మేం ఎల్లప్పుడూ జాతీయ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడేందుకే ప్రయత్నిస్తాం. భారత్​-చైనా సరిహద్దులో శాంతి, స్థిరత్వ స్థాపనకు కట్టుబడి ఉన్నాం."

-హువా చున్యింగ్​, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.

అప్పటివరకు తప్పవు..

మరోవైపు.. భారత్​ -చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై(India China Border Dispute) భారత ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎంఎం నరవణె(Army Chief Of India).. కీలక వాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య కచ్చితమైన సరిహద్దు ఒప్పందం కుదిరే వరకు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటాయని అభిప్రాయపడ్డారు.

"భారత్​-చైనా మధ్య తీవ్రమైన సరిహద్దు సమస్య ఉంది. గతంలోలా వారి నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. ఆ దేశంతో కచ్చితమైన సరిహద్దు ఒప్పందం కుదిరేవరకు ఈ ఉద్రిక్తతలు జరుగుతూనే ఉంటాయి. ఆ ఒప్పందం ద్వారా చైనాతో సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పే దిశగా మేం కృషి చేస్తున్నాం."

-ఎంఎం నరవణె , భారత ఆర్మీ చీఫ్​ జనరల్​

అఫ్గాన్​లో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో తలెత్తే ముప్పును ఎదుర్కోవడానికి భారత ఆర్మీ దృష్టి సారించిందని నరవణె తెలిపారు. ఆ ముప్పును ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలతో సిద్ధమవుతున్నామని చెప్పారు. పీహ్​చ్​డీ చాంబర్​ ఆప్ కామర్స్​ అండ్ ఇండస్ట్రీ సమావేశానికి హాజరైన నరవణె ఈమేరకు మాట్లాడారు.

చైనా-భారత్ సరిహద్దు ప్రాంతమైన తూర్పు లద్ధాఖ్​లోని గల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య గతేడాది జూన్​లో ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘర్షణలల్లో ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది. బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య జరిగిన దౌత్య, మిలిటరీ చర్చల్లో ఒప్పందం కుదిరినప్పటికీ అది పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు.

ఇదీ చూడండి: సరిహద్దు వెంబడి చైనా 'గ్రామాలు'- 2.4లక్షల మందితో నిఘా!

ఇదీ చూడండి:- 'చైనా దురుసుతనం వల్లే లద్దాఖ్​లో అశాంతి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.