ETV Bharat / international

నేపాల్​కు భారత్​ అంబులెన్సుల సాయం

author img

By

Published : Apr 22, 2021, 3:05 PM IST

కరోనా చికిత్సలో కీలకమైన వెంటిలేటర్లు, 39 అంబులెన్సులు సహా ఆరు పాఠశాల బస్సులను నేపాల్‌కు కానుకగా అందించింది భారత్. ఇరు దేశాల నడుమ ఉన్న స్నేహానికి గుర్తుగానే వీటిని అందించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.

India gifts 39 ambulances, 6 school buses to Nepal
నేపాల్​కు 39 అంబులెన్సులను అందించిన భారత్​

కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో పొరుగు దేశం నేపాల్​కు వైద్య మౌలిక సదుపాయాల కల్పనలో భారత్​ అండగా నిలుస్తోంది. కరోనా చికిత్సలో కీలకంగా ఉపయోగించే వెంటిలేటర్లు, 39 అంబులెన్సులు సహా.. ఆరు పాఠశాల బస్సులను నేపాల్‌కు భారత్ కానుకగా అందించింది.

కరోనాపై పోరులో నేపాల్​కు నిరంతర మద్దతు ఇస్తామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అందులో భాగంగానే వెంటిలేటర్లు, ఈసీజీ పరికరాలు, ఆక్సిజన్ మానిటర్లు, ఇతర అత్యవసర వైద్య పరికరాలతో కూడిన 39 అంబులెన్స్‌లను నేపాల్‌ ప్రభుత్వానికి, అక్కడి స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చినట్లు వెల్లడించింది.

గతేడాది మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని భారత్ 41 అంబులెన్సులు, ఆరు పాఠశాల బస్సులను నేపాల్‌కు ఇచ్చింది. వీటితో పాటు.. ఆ దేశంలోని వివిధ ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తోంది.అక్కడి వారసత్వ సంపదను పరిరక్షణ, మౌలిక సదుపాయాల పునర్నిర్మాణంలోనూ నేపాల్​కు సహకారం అందిస్తోంది.

ఇవీ చదవండి: నేపాల్​ ఆర్మీకి లక్ష టీకాలు అందించిన భారత్​

నేపాల్​ పాఠశాలల కోసం భారత్​ భారీ సాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.