ETV Bharat / international

ఎడతెరపి లేని వర్షాలు- 88కి చేరిన మృతులు

author img

By

Published : Oct 21, 2021, 3:35 PM IST

Updated : Oct 21, 2021, 3:55 PM IST

నేపాల్​ను భారీ వర్షాలు (Nepal Rain Today) ముంచెత్తుతున్నాయి. వరదలు సహా కొండచరియలు విరిగిపడిన కారణంగా ఇప్పటివరకు 88 మంది మృతి చెందారు. మరో 30 మంది గల్లంతయ్యారు.

nepal rains deaths
నేపాల్​ వరదలు

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్ ​(Nepal Rain Today) చిగురుటాకులా వణికిపోతోంది. వరదలు, కొండ చరియలు విరిగిపడిన కారణంగా గురువారం మరో 11 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 88కి చేరింది. మరో 30 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు నేపాల్ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది.

nepal rains
నేపాల్​లో ఇళ్లను ముంచెత్తిన వరద
nepal rains
నీట మునిగిన పంటలు

తూర్పు నేపాల్​లోని పంచాతర్ జిల్లాలో అత్యధికంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలమ్, దోతి జిల్లాలో 13 మంది చొప్పున మరణించారు. మరో 15 జిల్లాల్లోనూ మరణాలు సంభవించాయి. వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ మరణాలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

nepal rains
నేపాల్​లో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
nepal rains
ఎడతెరపి లేని వర్షాలతో నేపాలీల అవస్థలు

నేపాల్​లోని(Nepal Rain Today) 20 జిల్లాలు.. వరదల కారణంగా ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. ఒక్క బాఝంగ్ జిల్లాలో 21 మంది గల్లంతయ్యారని చెప్పారు. అయితే.. గురువారం నుంచి వాతావరణ పరిస్థితులు మెరుగు పడుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు.. హుమ్లా జిల్లాలో హిమపాతం వల్ల అక్కడ చిక్కుకున్న పర్యటకులను రక్షించాలని పోలీసులు, సాయుధ బలగాలు, సైన్యాన్ని.. నేపాల్​ హోం శాఖ మంత్రి బాల్​కృష్ణ ఖండ్​ ఆదేశించారు.

ఇవీ చూడండి:

కరోనా మరణాల రికార్డ్​- వారం పాటు కార్యాలయాలు బంద్​!

మనిషికి పంది కిడ్నీ అమర్చిన వైద్యులు- ఆపరేషన్ సక్సెస్!

Last Updated :Oct 21, 2021, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.