ETV Bharat / international

వుహాన్​ ఆస్పత్రుల్లో 'సున్నా'కు చేరిన కరోనా బాధితులు

author img

By

Published : Apr 26, 2020, 5:17 PM IST

కరోనా వ్యాప్తికి కేంద్ర బిందువైన వుహాన్​లో వైరస్ బాధితులందరూ కోలుకున్నారు. అక్కడి ఆసుపత్రుల్లో కరోనా రోగుల సంఖ్య సున్నాకు చేరిందని చైనా ప్రభుత్వం ప్రకటించింది.

Wuhan
వుహాన్

కరోనాకు పుట్టినిల్లు అయిన వుహాన్​లోని ఆస్పత్రుల్లో వైరస్ బాధితుల సంఖ్య 'సున్నా'కు చేరింది. 76 రోజుల లాక్​డౌన్​ను ఏప్రిల్ 8న ఎత్తివేసిన తర్వాత తాజా నిర్ణయంతో వుహాన్​ నగరం మరో మైలురాయిని అందుకుంది.

హుబే రాష్ట్ర ఆరోగ్య కమిషన్​ కూడా.. శనివారం ఒక్క కేసు కానీ.. మరణం నమోదు కాలేదని ప్రకటించింది. కరోనా నుంచి కోలుకున్న 11 మందిని వుహాన్​ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేసినట్లు తెలిపింది. వుహాన్​ ఆస్పత్రులో చివరి కరోనా బాధితుడు శుక్రవారం కోలుకున్నాడని చైనా జాతీయ మీడియా తెలిపింది.

కఠిన చర్యల వల్లనే..

వుహాన్​తో కలిపి హుబే రాష్ట్రంలో మొత్తం 68,128 కేసులు నమోదయ్యాయి. వైద్య సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమైందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్​ (ఎన్​హెచ్​సీ) అధికార ప్రతినిధి మిఫెంగ్ పేర్కొన్నారు.

హుబే రాష్ట్రంలో కఠిన లాక్​డౌన్​ను అమలు చేయటంతో పాటు 14 తాత్కాలిక ఆసుపత్రులు, 42 వేలమంది వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయటం వల్లనే వైరస్​ను అదుపుచేయగలిగామని చైనా ప్రకటించింది.

ఆ కేసుల్లో పెరుగుదల..

అయితే వుహాన్​లో లక్షణాలు లేని కేసులు స్థిరంగా పెరుగుతుండటం వల్ల అక్కడ సాధారణ పరిస్థితి లేదని తెలిపింది. ఇప్పటివరకు హుబే రాష్ట్రంలో 572 లక్షణాలు లేని కరోనా కేసులు నమోదు అయ్యాయని స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చూడండి:'దొంగ కరోనా' కేసులతో చైనాలో మళ్లీ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.