ETV Bharat / international

3.5 కోట్లు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Oct 4, 2020, 6:55 PM IST

CORONAVIRUS CASES CROSSED 3.5 CRORE MARK IN WORLD WIDE
ప్రపంచ వ్యాప్తంగా 3.5కోట్లు దాటిన కరోనా కేసులు

ప్రపంచ దేశాలపై కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. స్థిరంగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 3 కోట్ల 51 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. కరోనా కారణంగా 10 లక్షల 38 వేల మంది మరణించారు. రష్యాలో ఆదివారం ఒక్కరోజే పదివేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 3 కోట్ల 51 లక్షల మందికి మహమ్మారి సోకింది. 10 లక్షల 38 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 2 కోట్ల 61 లక్షల మందికిపైగా కోలుకున్నారు. సుమారు 79.79 లక్షల యాక్టివ్​ కేసులున్నాయి.

  • కరోనా​ కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో 76 లక్షల మందికి వైరస్​ సోకింది. ఇప్పటివరకు అక్కడ 2 లక్షల 14 వేల మందికిపైగా చనిపోయారు.
  • రష్యాలో కొత్తగా 10,499 కొవిడ్​ కేసులు వెలుగు చూడగా.. బాధితుల సంఖ్య 12,15,001కి ఎగబాకింది. మరో 107 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 21,358కి చేరింది.
  • మెక్సికోలో ఆదివారం ఒక్కరోజే 4,863 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 7,57,953కు పెరిగింది. కరోనా కారణంగా మరో 388 మరణించగా.. మృతుల సంఖ్య 78,880కు ఎగబాకింది.
  • పాక్​లో మరో 632 మంది మహమ్మారి బారినపడ్డారు. ఫలితంగా బాధితుల సంఖ్య 3.14 వేలు దాటింది. ఇప్పటివరకు ఆ దేశంలో 6,513 మంది వైరస్ సోకి మరణించారు.
  • నేపాల్​లో కొత్తగా 2,253 కరోనా కేసులు బయటపడగా.. బాధితుల సంఖ్య 86,863కు చేరింది. ఇప్పటివరకు అక్కడ 535 కొవిడ్​ మరణాలు సంభవించాయి.

ఇదీ చూడండి: 'భారత్​లో 2021 జులైకి 25 కోట్ల మందికి వ్యాక్సిన్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.