ETV Bharat / international

శాంతించని కరోనా.. 2 కోట్ల 40లక్షలు దాటిన బాధితులు

author img

By

Published : Aug 26, 2020, 9:08 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 40లక్షల 50వేలు దాటింది. ఇప్పటివరకు 8 లక్షల 23వేల మందికిపైగా వైరస్​కు బలయ్యారు. అమెరికా, బ్రెజిల్​, భారత్​లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

corona global count crosses 2.40cr mark
శాంతించని కరోనా.. 2కోట్ల 40లక్షలు దాటిన బాధితులు

కరోనా మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 2 కోట్ల 40 లక్షల 50వేల 731కి చేరింది. వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 8 లక్షల 23వేల 298కి పెరిగింది. దాదాపు కోటి 66 లక్షల మంది వ్యాధి బారినపడి కోలుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాల్లో కొత్త కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. అమెరికాలో బాధితుల సంఖ్య 60 లక్షలకు చేరువ కాగా.. మృతుల సంఖ్య లక్షా 82వేలు దాటింది.

కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాలు..

దేశంకేసులుమరణాలు
1అమెరికా59,55,7281,82,404
2బ్రెజిల్36,74,1761,16,666
3భారత్31,67,32458,390
4రష్యా9,66,18916,568
5దక్షిణాఫ్రికా6,13,01713,308

ఇదీ చూడండి: కరోనా నుంచి కోలుకున్నా.. మళ్లీ వస్తుంది జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.