ETV Bharat / international

రష్యా వేదికగా రక్షణ మంత్రుల భేటీకి చైనా పిలుపు!

author img

By

Published : Sep 4, 2020, 5:18 AM IST

రష్యాలో జరుగుతోన్న షాంఘై కోఆపరేషన్​ ఆర్గనైజేషన్​ సదస్సు వేదికగా.. భారత్​, చైనా రక్షణ మంత్రుల సమావేశం నిర్వహించాలని చైనా కోరినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని భారత అధికారులకు తెలియజేసినట్లు చెప్పాయి. అయితే.. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

Chinese Defence Minister seeks meeting with Rajnath Singh
రష్యా వేదికగా రక్షణ మంత్రుల భేటీకి చైనా పిలుపు!

సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ షాంఘై కోఆపరేషన్​ ఆర్గనైజేషన్ (ఎస్​సీఓ)​ సదస్సు వేదికగా ఇరు దేశాల రక్షణ మంత్రులు సమావేశం నిర్వహించాలని చైనా కోరినట్లు తెలుస్తోంది. భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​తో భేటీ కోసం చైనా రక్షణ మంత్రి వీ ఫెంగి సుముఖంగా ఉన్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. రాజ్​నాథ్​తో సమావేశం ఏర్పాటు చేయాలని కోరినట్లు సమాచారం.

ఇరు దేశాల రక్షణ మంత్రులు సమావేశం కావాలనే తన అభిష్టాన్ని చైనా.. భారత అధికారుల​కు తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

ఉద్రిక్తతల నడుమ ఇరువురు మంత్రుల మధ్య సమావేశానికి చైనా పిలుపునివ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది.

మూడు రోజుల పర్యటనలో భాగంగా రష్యాకు వెళ్లారు రాజ్​నాథ్​. ఎస్​సీఓ సదస్సుతో పాటు రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అయితే.. రాజ్​నాథ్​ షెడ్యూల్​లో చైనా రక్షణ మంత్రితో భేటీ లేదు.

ఇదీ చూడండి: 'భారతీయుల ఆశయాలను కరోనా సంక్షోభం అడ్డుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.