ETV Bharat / international

చైనాలో కరోనా 2.0​.. ఈసారి మరింత విచిత్రంగా...

author img

By

Published : Apr 1, 2020, 4:08 PM IST

కరోనా వైరస్​ జన్మస్థలం చైనాలో రెండో రౌండ్​ కేసులు మొదలయ్యాయి. బుధవారం నాటికి 1,541 కేసులు నమోదైనట్లు చైనా ప్రభుత్వం వెల్లడించింది. అయితే వాళ్లలో కరోనా లక్షణాలు మాత్రం లేకపోవడం చర్చనీయంశంగా మారింది.

China on revealed the presence of 1,541 asymptomatic cases carrying the deadly novel coronavirus after COVID-19 outbreak,
కరోనా 2.0 : చైనాలో కరోనా వైరస్ రెండో రౌండ్​.. ఈసారి విచిత్రంగా

ప్రపంచ దేశాలన్నీ ఇంకా కరోనా వైరస్​తో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఆ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో ఇంకా అంతుచిక్కలేదు. ఈలోపే చైనాలో కొవిడ్​-19 రెండో రౌండ్​ మొదలు పెట్టేసింది. హమ్మయ్య కేసులు తగ్గాయని ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ పంజా విసురుతోంది. అయితే తొలి రౌండ్​లా కాకుండా నిశబ్ధంగా వస్తోంది. సాధారణంగా కరోనా బాధితులు దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే అవేమీ లేకుండానే ఈసారి కరోనా పాజిటివ్​ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

బుధవారం నాటికి 'కరోనా 2.0' కేసులు 1,541 నమోదైనట్లు చైనా జాతీయ హెల్త్​ కమిషన్​(ఎన్​హెచ్​సీ) పేర్కొంది. వారికి సంబంధించిన డేటానూ విడుదల చేసింది. కొత్తగా వచ్చిన కేసులపై మళ్లీ పరిశోధన ప్రారంభించింది.

మళ్లీ క్వారంటైన్​లోనే...

లక్షణాలు లేకుండా వచ్చిన కరోనా 2.0 వైరస్​ బాధితులను 14 రోజులు క్వారంటైన్​లో ఉంచుతున్నారు. వీరందరికీ మళ్లీ పరీక్షలు నిర్వహించి కరోనా నెగిటివ్​ వచ్చేవరకు ఇంటికి పంపించమని అక్కడి ప్రభుత్వం స్పష్టంచేసింది. వైరస్​ లక్షణాలు ఉన్నవాళ్లతో పోల్చినప్పుడు, కొత్తగా నమోదైన కేసుల్లో పెద్ద తేడాలు లేవని పేర్కొంది. అయితే ఈసారి తీవ్రత ఎక్కువ ఉండకపోవచ్చని వైద్య నిపుణులు, పరిశోధకులు భావిస్తున్నారు. వైరస్​ వ్యాప్తి తక్కువగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కేసులు దాచేసిన చైనా..?

ఫిబ్రవరిలోనే కరోనా రెండో రౌండ్​ కేసులు వచ్చినా.. ఆ సంఖ్యను బయటకు చెప్పలేదని హాంకాంగ్​కు చెందిన సౌత్​ చైనా మార్నింగ్​ పోస్ట్ పత్రిక పేర్కొంది. దాదాపు 43 వేల కేసులు లక్షణాలు లేకుండా నమోదైన విషయాన్ని బహిర్గతం చేయలేదని చైనా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అయితే ఆ సంస్థ ఆరోపణలపై చైనా అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు.

సెరోలాజికల్​ టెస్టింగ్​...

చైనాలోని అందరికీ సెరోలాజికల్​ టెస్టు చేసేందుకు చైనా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీని ద్వారా సీరం సహా శరీరంలోని ఫ్లూయిడ్​లను పరీక్షిస్తారు. వీటి ద్వారా ఏవైనా యాంటీబాడీలు ఉన్నాయోమో చూస్తారు. ఎందుకంటే కరోనా వైరస్​ కోసం ఇచ్చిన డ్రగ్..​ ఒక్కోసారి మానవ కణాలపైనే దాడి చేస్తే మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. వ్యాధి తగ్గినప్పటికీ మళ్లీ బాధితులకు పరీక్షలు చేయనున్నట్లు అక్కడి వైద్య విభాగం ఎన్​హెచ్​సీ వెల్లడించింది.

కరోనా తీవ్రత తగ్గడం వల్ల చైనాలోని వుహాన్​ సహా దేశమంతటా లాక్​డౌన్​ ఎత్తివేసింది ఆ దేశ ప్రభుత్వం. దేశీయంగా ప్రజారవాణాకు అనుమతి ఇచ్చింది. అయితే విదేశీయులు రాకుండా ఆంక్షలు విధించింది. కంపెనీలు, కర్మాగారాలు మళ్లీ పునః ప్రారంభమయ్యాయి.

చైనాలో తొలి దశలో 81,554 మంది కరోనా వైరస్​ బారిన పడగా.. 3,312 మంది చనిపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.