ETV Bharat / international

ఆడుకుంటుండగా విషాదం.. ఈదురు గాలులకు ఐదుగురు పిల్లలు బలి

author img

By

Published : Dec 16, 2021, 4:12 PM IST

Bouncy Castle: బౌన్సీ క్యాజిల్​పై ఆడుకుంటుండగా విషాదం జరిగింది. అభంశుభం ఎరగని ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలులతో క్యాజిల్​ పైకి ఎగరగా.. పిల్లలు కింద పడినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని టాస్మేనియాలో ఈ ఘటన జరిగింది.

5 children die in bouncy castle accident in Australia
5 children die in bouncy castle accident in Australia

Bouncy Castle: ఆస్ట్రేలియాలో ఓ విషాదకర ఘటన జరిగింది. పిల్లలు ఆడుకునే బౌన్సీ క్యాజిల్​ గాల్లోకి ఎగరగా.. ఐదుగురు చిన్నారులు చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. టాస్మేనియాలోని హిల్​క్రీస్ట్​ ప్రైమరీ స్కూల్​ విద్యా సంవత్సరం ముగింపు వేడుకల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

బలమైన ఈదురు గాలులతో క్యాజిల్​ పైకి ఎగరగా.. పిల్లలు 10 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడినట్లు తెలుస్తోంది.

మృతులు 6 నుంచి 11 ఏళ్ల మధ్య వయసువారని అధికారులు తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.

గాయపడ్డవారిని హెలికాప్టర్లలో ఆస్పత్రులకు తరలించారు. చిన్నచిన్న గాయాలైన పిల్లలకు పాఠశాల ఆవరణలోనే ప్రథమ చికిత్స నిర్వహించారు.

Australia Bouncy Castle Tragedy

టాస్మేనియా స్టేట్​ ప్రీమియర్ పీటర్​ గట్​వెయిన్​​.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

దీనిని అత్యంత విషాదకర ఘటనగా పేర్కొన్నారు టాస్మేనియా పోలీస్​ కమాండర్​ విలియమ్స్​.

ఇదీ చూడండి: 'షీనా బోరా చనిపోలేదు.. కశ్మీర్​లో ఉంది'.. సీబీఐకి ఇంద్రాణీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.