ETV Bharat / international

కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి

author img

By

Published : Aug 14, 2020, 9:59 PM IST

నేపాల్​లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా సింధుపాల్​చౌక్​ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 27 మంది ఆచూకీ గల్లంతయింది.

landslides in Nepa
నేపాల్​లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతోన్న ఘటనలు పెరుగుతున్నాయి

నేపాల్​ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదలకు తోడు కొండచరియలు విరిగిపడుతూ భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. తాజాగా సింధుపాల్​చౌక్​ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయప్డడారు. మరో 27 మంది ఆచూకీ గల్లంతు అయ్యింది.

" జిల్లాలోని జకల్​ రూరల్​ మున్సిపాలిటీ పరిధిలోని లిజిమొ లామా ప్రాంతంలో కొండచరియలు విరిగిపి 13 ఇళ్లు పూర్తిగా శిథిలాల్లో కూరుకుపోయాయి. ఈ దుర్ఘటనలో ఐదు కుటుంబాలకు చెందిన 27 మంది ఆచూకీ గల్లంతయ్యింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రాంతంలో ఉన్న మరో 30 ఇళ్లకు ప్రమాదం పొంచి ఉంది. "

- అధికారులు.

ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని నేపాల్​ ఆర్మీ హెలికాప్టర్​ సాయంతో జిల్లా కేంద్రానికి తరలించారు. ఇప్పటి వరకు ఐదుగురు చిన్నారులు, నలుగురు పురుషులు, ఇద్దరు మహిళల మృతదేహాలను వెలికితీశారు అధికారులు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు.

ఇదీ చూడండి: గల్వాన్​ లోయ యోధులకు శౌర్య పతకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.